Nargis Fakhri: సినిమాలకు గుడ్ బై చెప్పిన హరిహర వీరమల్లు హీరోయిన్.. ఎందుకంటే?

సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు మంచి గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ కొంతమందికి మాత్రం తొలిసినిమాతోనే అదిరిపోయే క్రేజ్ వచ్చి పడుతుంది.....

Nargis Fakhri: సినిమాలకు గుడ్ బై చెప్పిన హరిహర వీరమల్లు హీరోయిన్.. ఎందుకంటే?

Nargis Fakhri To Say Good Bye To Movies

Nargis Fakhri: సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు మంచి గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ కొంతమందికి మాత్రం తొలిసినిమాతోనే అదిరిపోయే క్రేజ్ వచ్చి పడుతుంది. ఇలాంటి వారు బాలీవుడ్ లోనూ ఉన్నారు. వారిలో ఒకరే నటి నర్గీస్ ఫక్రీ. బాలీవుడ్‌లో రాక్‌స్టార్ చిత్రంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తొలి సినిమాకే మంచి గుర్తింపు రావడంతో, అమ్మడకి వరుసబెట్టి ఆఫర్లు వచ్చి పడ్డాయి. దీంతో ఆమె బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో నర్గీస్ ఫక్రీ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నా, నర్గీస్ ఫక్రీ మాత్రం సినిమాలకు గుడ్ బై చెప్పనుందట. దీనికి బలమైన కారణం కూడా ఉందని ఆమె చెబుతోంది. గతకొంత కాలంగా నర్గీస్ ఫక్రీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీని కారణంగా ఆమె తన పని సరిగ్గా చేయలేకపోతున్నట్లు పేర్కొంది. వరుస సినిమాలతో తాను కుటుంబానికి, స్నేహితులకు సమయాన్ని కేటాయించలేకపోతున్నానని ఆమె పేర్కొంది. దీంతో ఆమె త్వరలోనే ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావిస్తోందట. అందుకే సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకుందట.

Nargis Fakhri: నర్గీస్ అసలేంటీ అందం..!

అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారట. కెరీర్ మంచి స్పీడు మీదున్నప్పుడు ఇలా సినిమాలకు బ్రేక్ ఇస్తే.. మళ్లీ సినిమాల్లోకి రావడం అంత సులువు కాదని ఆమెకు చెప్పారట. అవకాశాలు ఉన్నప్పుడే వాటిని వినియోగించుకోవాలని.. మనకు కావాల్సినప్పుడు అవి రావని ఆమెకు చాలా మంది సన్నిహితులు సూచించారట. అయితే నర్గీస్ ఫక్రీ మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధిస్తోంది. తమకోసం సమయం కేటాయించుకుంటే, ఇంకా కోల్పోయేది ఏముంటుందని ఆమె అంటోంది.

ఏదేమైనా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు పలువురు అభిమానులు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి నర్గీస్ ఫక్రీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేక అనుకున్నట్లుగానే సినిమాలకు గుడ్ బై చెబుతుందా అనేది చూడాలి.