Nasa Rover : జీవాన్వేషణ కోసం అంగారకుడిపై నాసా రోవర్ శోధన

పర్సెవెరెన్స్ తీసినఫోటోలను నాసా విడుదల చేసింది. మార్స్ ఉపరితలంపై రోబో తవ్వుతున్నట్టు ఓచిన్న గుట్ట దాని పక్కనే రంద్రం ఆ ఫోటోలలో కనిపిస్తున్నాయి.

Nasa Rover : జీవాన్వేషణ కోసం అంగారకుడిపై నాసా రోవర్ శోధన

Nasa

Nasa Rover : అరుణ గ్రహంపై జీవం జాడను కనుగొనేందుకు అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫ్రిబ్రవరిలో ఆరు చక్కాల రోవర్ ను విజయవంతంగా పంపింది. మార్క్ అడుగుపెట్టిన కొద్ది సేపటికే రెండు ఫోటోలను సైతం పంపింది. తక్కువ రెజల్యూషన్ కెమెరాలను ఈ రోవర్ కు అమర్చారు. కెమెరాలెన్స్ పై దుమ్ము పేరుకున్నప్పటికీ రోవర్ , ముందు, వెనుక బాగాల్లో అంగారకుడి ఉపరితలం స్పష్టంగా కనిపిస్తోంది.

పర్సెవెరెన్స్ తీసినఫోటోలను నాసా విడుదల చేసింది. మార్స్ ఉపరితలంపై రోబో తవ్వుతున్నట్టు ఓచిన్న గుట్ట దాని పక్కనే రంద్రం ఆ ఫోటోలలో కనిపిస్తున్నాయి. నమూనాను సేకరించి ట్యూబ్ లో సీల్ చేయటానికి పర్సెవెరెన్స్ చేసిన తొలిప్రయత్నం విఫలమైనట్లు అర్ధమౌతుంది.

పర్సెవెరెన్స్ ప్రస్తుతం అగారకుడిపై జెజెరో అనే సరస్పు ప్రాంతం సమీపంలో ఉన్నట్లు తెలుస్తుంది. శాస్త్రవేత్తలు నిర్ధేశించిన విధంగా అంగారకుడి ఉపరితంపై డ్రిల్లింగ్ చేసి నమూనాలు సేకరించేందుకు 11 రోజుల సమయం పడుతుందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ తెలిపారు. 2023నాటికి అంగారకుడి నుండి 30 నమూనాలు సేకరించాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నమూనాలను విశ్లేషించటం ద్వారా అంగారకుడిపై జీవజాలం ఉనికికి సబంధించిన సమాచారం కనుగొననున్నారు.

ఇదిలావుంటే శాస్త్రవేత్తలు నిర్ధేశించిన విధంగా ప్రస్తుతం రోవర్ ఉన్న జెజెరో సరస్సు 3.5 బిలియన్ సంవత్సారల క్రితం ఏర్పడిందిగా భావిస్తున్నారు. అంగారకుడిపై సరస్సు ఉండటాన్ని బట్టి అక్కడ నీరు ఉండే ఉంటుందన్న అంచనా వేస్తున్నారు. నీరు ఉంది కాబట్టి తప్పని సరిగా జీవజాలం ఉండే ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం సాగుతున్న పరిశోధనల వల్ల కొంత కీలకమైన సమాచారం లేకపోలేదని నాసా చెబుతుంది.