రియల్ సక్సెస్ అంటే ఇదే: ‘తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’..

టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఏ నిమిషాన లైఫ్, కెరీర్ ఏ టర్న్ తీసుకుంటుందో గెస్ చెయ్యలేం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రతి ఫ్రైడే జాతకాలు మారిపోతూ ఉంటాయి.. సినిమా ఫీల్డ్‌లో ‘తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అంటుంటారు. ఈ ఉదాహరణ దేనికోసం అంటే యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి గురించి..

రియల్ సక్సెస్ అంటే ఇదే: ‘తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’..

Prabhas – Naveen Polishetty: టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఏ నిమిషాన లైఫ్, కెరీర్ ఏ టర్న్ తీసుకుంటుందో గెస్ చెయ్యలేం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రతి ఫ్రైడే జాతకాలు మారిపోతూ ఉంటాయి.. సినిమా ఫీల్డ్‌లో ‘తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అంటుంటారు. ఈ ఉదాహరణ దేనికోసం అంటే యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి గురించి..

Naveen Polishetty

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న క్యారెక్టర్ తో ఇంట్రడ్యూస్ అయిన నవీన్, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ లో చేసింది చిన్న క్యారెక్టర్ అయినా ఆకట్టుకున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్యేయ’ తనకి మంచి బ్రేక్ ఇచ్చింది. తర్వాత బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘చిచ్చోరే’ సినిమాలో మంచి వేషం పడింది. రీసెంట్‌గా ‘జాతి రత్నాలు’ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.

Prabhas - Naveen Polishetty

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నవీన్ ఏ రేంజ్‌లో సందడి చేశాడో చూశాం. అతను మాట్లాడే విధానానికి డార్లింగ్ ఫిదా అయ్యారు. విశేషం ఏంటంటే.. ‘బాహుబలి’ రిలీజ్ టైంలో నవీన్ యాంకర్‌గా ప్రభాస్ అండ్ టీంని ఇంటర్వూ చేశాడు. కట్ చేస్తే ఆ ‘బాహుబలి’, పాన్ ఇండియా స్టార్ నవీన్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశాడు. రియల్ సక్సెస్ అంటే ఇదేనని కొత్తగా చెప్పక్కర్లేదు కదా..

Prabhas - Naveen Polishetty