Navi Mumbai: మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 151 సైలెన్సర్ల ధ్వంసం

హై వాల్యూమ్ ఇచ్చేలా సైలెన్సర్లను మార్చుకుని, భారీ శబ్దంతో చుట్టుపక్కల వాహనదారులను ఇబ్బందిపెడుతున్న వాహనదారులపై నవీ ముంబై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 151 సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.

Navi Mumbai: మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 151 సైలెన్సర్ల ధ్వంసం

Navi Mumbai: కొందరు తమ కార్లు, బైకుల సైలెన్సర్లను మోడిఫై చేస్తుంటారు. హై వాల్యూమ్ ఇచ్చేలా సైలెన్సర్లను మార్చుకుని, రోడ్లపై భారీ శబ్దంతో చుట్టుపక్కల వాహనదారులను ఇబ్బంది పెడుతుంటారు. ఈ శబ్దాలతో చెవులు హోరెత్తిపోతుంటాయి.

JK Rowling: సల్మాన్ రష్దీ తర్వాత నువ్వే.. ‘హ్యారీపోటర్’ రచయిత్రికి హెచ్చరికలు

నిబంధనల ప్రకారం.. ఇలా సైలెన్సర్లకు మార్పులు చేయడం నేరం. అలా మోడిఫై చేసిన వాహనదారులపై నవీ ముంబై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి, అలాంటి వాహనదారుల బెండు తీశారు. ప్రత్యేకంగా అలాంటి వాహనాలను గుర్తించి, వాటి సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. అలా 151 సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా, వాటిని రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఇవన్నీ హై వాల్యూమ్ సైలెన్సర్లు. పరిమితికి మించిన శబ్దం చేస్తుంటాయి. డీసీపీ పురుషోత్తమ్ కరాద్ ఆధ్వర్యంలో వీటిని ధ్వంసం చేశారు. ‘‘చాలా మంది యువత థ్రిల్ కోసం బైకులకు హై వాల్యూమ్ సైలెన్సర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు.

Salman Rushdie: సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగింపు.. నిందితుడిని ప్రశంసించిన ఇరాన్ మీడియా

వీటి వల్ల ఏర్పడుతున్న శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు వీటిని నియంత్రించాలనుకున్నాం. అందుకే స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. ఆ సైలెన్సర్లను వాహనదారులతోనే తీసేయించాం. గ్యారేజ్ నడిపేవాళ్లు ఇలాంటి సైలెన్సర్లను మోడిఫై చేసినా వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని పురుషో్త్తమ్ కరాద్ అన్నారు. నవీ పోలీసుల చర్యపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.