Nayan-Vignesh : పెళ్లి అయిన తెల్లారే.. తప్పు చేశామంటూ అందరికి క్షమాపణలు చెప్పిన నయనతార, విగ్నేష్..

విగ్నేష్ శివన్ ఈ ప్రెస్ నోట్ లో.. ''మాపెళ్లి తిరుమలలో జరగాలని కోరుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. చెన్నైలో మావివాహం జరిగింది. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో.................

Nayan-Vignesh : పెళ్లి అయిన తెల్లారే.. తప్పు చేశామంటూ అందరికి క్షమాపణలు చెప్పిన నయనతార, విగ్నేష్..

Nayan Vignesh

Nayan-Vignesh :  గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార-విగ్నేష్ శివన్ తాజాగా జూన్ 9న ఘనంగా వివాహం చేసుకున్నారు. ముందుగా తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకున్నా, సెక్యూరిటీ, జన సమూహం లాంటి ఇబ్బందులతో తిరుమలలో పెళ్లి క్యాన్సిల్ చేసుకొని మహాబలిపురం చేసుకున్నారు. వీరి పెళ్ళికి ప్రముఖ సౌత్ సెలబ్రిటీలు చాలా మంది వచ్చారు. అయితే పెళ్లి తర్వాత ఈ కొత్త జంట తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.

ఈ సమయంలో తిరుమల మాడ వీధుల్లో నయనతార, విగ్నేష్ చెప్పులు వేసుకొని నడిచారు. దీంతో ఇది వివాదం అయింది. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల మాడ వీధుల్లో నయనతార, విగ్నేష్ చెప్పులు వేసుకొని తిరగడంతో భక్తులు, టీటీడీ సీరియస్ అయ్యారు. టీటీడీ ఈ విషయంలో కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇక భక్తులు వీరిద్దర్నీ ట్రోల్ చేశారు. దీంతో అందరికీ క్షమాపణలు కోరుతూ నయనతార భర్త విగ్నేష్ శివన్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

Sudhakar Reddy : టికెట్ రేట్లు పెంచకుండానే బాహుబలి కోట్లు కలెక్ట్ చేసింది.. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు?

విగ్నేష్ శివన్ ఈ ప్రెస్ నోట్ లో.. ”మాపెళ్లి తిరుమలలో జరగాలని కోరుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. చెన్నైలో మావివాహం జరిగింది. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో పెళ్లి తరువాత ఇంటికి కూడా వెళ్లకుండా తిరుమలకు వచ్చాము. కల్యాణోత్సవం సేవలో శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది. మా పెళ్లి తిరుమలలో పూర్తయినట్లు అనిపించేలా ఫోటో తీసుకోవాలని అనుకున్నాము. అయితే అధిక జనం రావడంతో శ్రీవారి ఆలయం వద్ద నుండి వెళ్ళిపోయాము. రెండవ సారి మళ్ళీ శ్రీవారి ఆలయం వద్దకు రావడం జరిగింది. రెండవసారి వచ్చే కంగారులో పాదరక్షలు ధరించి రావడం జరిగింది. ఇందుకు మనస్ఫూర్తిగా మేమిద్దరం క్షమాపణ కోరుతున్నాం. మాపెళ్లి ఏర్పాట్ల కోసం గత 30 రోజుల్లో ఐదుసార్లు తిరుమలకు రావడం జరిగింది ఎప్పుడూ ఇలా జరగలేదు. మేము ఎంతగానో ప్రేమించే స్వామి వారిపై భక్తి లేకుండా లేదు. అనుకోకుండా జరిగిన ఈ తప్పుకు మేము క్షమాపణలు చెప్తున్నాము” అని తెలిపారు.