Jagdeep Dhankhar: నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్

భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు జగదీప్ ధన్‌కర్. ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నెల 11న ఆయన ప్రమాణం చేస్తారు.

Jagdeep Dhankhar: నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్

Jagdeep Dhankhar: భారత నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌కర్. శనివారం జరిగిన ఓటింగ్‌లో ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆళ్వాపై విజయం సాధించారు. జగదీప్ ధన్‌కర్‌కు 528 ఓట్లు రాగా, మార్గరేట్ ఆళ్వాకు 182 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

Niti Aayog: కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు.. తెలంగాణ సీఎం ఆరోపణలపై స్పందించిన నీతి ఆయోగ్

15 ఓట్లు చెల్లకుండా పోయాయి. మార్గరేట్ ఆళ్వాపై ఆయన 346 ఓట్ల ఆధిక్యం సాధించారు. ధన్‌కర్‌ గెలుపును లోక్‌‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్ అధికారికంగా ప్రకటించారు‌. ఈ ఎన్నికలో పార్లమెంట్‍‌కు చెందిన 725 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరో ఎనిమిది ఎంపీ స్థానాలు ఖాళీగా ఉండటంతో ఓటింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీ జగదీప్ ధన్‌కర్‌ను కలిసి అభినందనలు తెలపనున్నారు. జగదీప్ ధన్‌కర్‌ గెలుపుతో ఆయన స్వస్థలమైన రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్‌లో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. 1951లో జన్మించిన జగదీప్ ధన్‌కర్‌, లా పూర్తి చేసి న్యాయవాదిగా పనిచేశారు.

Woman Suicide: ఆడపిల్లల్ని కన్నందుకు భర్త వేధింపులు.. అమెరికాలో భారతీయ మహిళ ఆత్మహత్య

ఆ తర్వాత 1989లో రాజకీయాల్లో చేరారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఉప రాష్ట్రపతి పదవి దేశంలో రెండో అతిపెద్ద పదవి. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈ నెల 10న ముగుస్తుంది. 16వ ఉప రాష్ట్రపతిగా ఈ నెల 11న జగదీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం చేస్తారు.