‘నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి’.. ఫీల్ గుడ్ సాంగ్..

‘నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి’.. ఫీల్ గుడ్ సాంగ్..

Nee Chitram Choosi: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. వాలెంటైన్స్ డే కానుకగా బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ రిలీజ్ చేశారు. పవన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా మిట్టపల్లి సురేందర్ లిరిక్స రాశారు.. అనురాగ్ కులకర్ణి చక్కగా పాడారు.
‘నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో.. ఇంచు ఇంచులోన పొంచి ఉన్నా ఈడు నిన్ను ఎంచుకుంది రయ్యో’.. అంటూ సాగే ఈ ఫీల్ గుడ్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘లవ్ స్టోరీ’ ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.