Sanbor Shullai : చికెన్, మటన్ కంటే గొడ్డు మాంసమే ఎక్కువ తినండీ : బీజేపీ మంత్రి

చికెన్, మటన్,చేపలు కంటే గొడ్డు మాంసమే ఎక్కువ తినండీ అంటూ బీజేపీ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.గొడ్డు మాంసం ప్ర‌జ‌లు తినేలా తాను ప్రోత్స‌హిస్తాన‌ని మంత్రి తెలిపారు.

Sanbor Shullai  : చికెన్, మటన్ కంటే గొడ్డు మాంసమే ఎక్కువ తినండీ : బీజేపీ మంత్రి

Minister Sanbor Shullai (1)

‘Eat More Beef Than Any Other Meat’: సాధారణంగా బీజేపీ నేతలు బీఫ్ తినొద్దంటూ చెబుతుంటారు.గోవధ చేస్తే కఠిన చర్యలు అని హెచ్చరిస్తుంటారు. గో రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఓ బీజేపీ మంత్రి మాత్రం గొడ్డు మాంసాన్నే తినమని చెబుతున్నారు. చికెన్, మటన్, చేపలు కంటే గొడ్డు మాంసం తినమని పిలుపునిస్తున్నారు మేఘాలయ మంత్రి సన్‌బోర్ షుల్లాయ్.

దక్షిణ షిల్లాంగ్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సన్ బోర్ పశుసంవర్ధక, పశువైద్య శాఖ మంత్రి అయ్యారు. చికెన్, మ‌ట‌న్, చేప‌ల కంటే అధికంగా గొడ్డు మాంసం ప్ర‌జ‌లు తినేలా తాను ప్రోత్స‌హిస్తాన‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇలా చేయడం ద్వారా బీజేపీ గోవధపై నిషేధం విధిస్తుందనే తప్పుడు భావన తొలగిపోతుంది ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమకు ఇష్టమైన ఆహారం తినే స్వేచ్ఛ ఉంటుందని నేను నమ్ముతానని షుల్లాయ్ తెలిపారు.

కాగా..ఇటీవలే షుల్లాయ్ పశుసంవర్ధక, పశువైద్య శాఖ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంగా.. అసోం ప్ర‌భుత్వం తీసుకొచ్చే కొత్త గో చ‌ట్టంతో మేఘాల‌య‌కు ప‌శువుల ర‌వాణా చేసే విష‌యంలో ఎలాంటి ప్ర‌భావం చూప‌కుండా.. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వా శ‌ర్మ‌తో తాను చర్చిస్తానని తెలిపారు.

కాగా.. అసోం, మిజోరం మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈక్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కేసు నమోదైంది… ఈ వివాదంలో ఇప్పటికే… ఆరుగురు అసోం పోలీసులు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. గత సోమవారం జరిగిన కాల్పులు, ఘర్షణలు… వారి ప్రాణాలు తీశాయి. ఈ వివాదం శుక్రవారం మరో మలుపు తిరిగింది. మిజోరంలోని కోలాసిబ్ జిల్లాకు చెందిన ఆరుగురు అధికారులు తమ ముందు ఆగస్ట్ 2న హాజరుకావాలని శుక్రవారం అసోం నుంచి సమన్లు జారీ అయ్యాయి. జులై 26 ఘటనపై విచారణ జరపాల్సి ఉందని వాటిలో ఉంది. అటు మిజోరం కూడా ఘర్షణ జరిగిన తర్వాతి రోజు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతోపాటూ… మరో ఆరుగురు అధికారులపై కేసు పెట్టింది. వాళ్లంతా తమ దగ్గరకు రావాలన్నది మిజోరం ఆదేశం. కోలాసిబి జిల్లాలోని వైరెంగ్టే పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.