చాలా టేస్టీ గురూ : ఆన్ లైన్ లో కల్లు విక్రయాలు

  • Published By: madhu ,Published On : May 4, 2020 / 11:54 AM IST
చాలా టేస్టీ గురూ : ఆన్ లైన్ లో కల్లు విక్రయాలు

కరోనా రాకాసి వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది జీవితాలపై పెను ప్రభావం చూపెడుతోంది. చిన్న వ్యాపారులు చేసే వారి పరిస్థితి దయనీయగా మారింది. లాక్ డౌన్ వల్ల లిక్కర్ షాపులకు తాళాలు పడ్డాయి. దీంతో కల్లుకు ఎక్కడ లేని డిమాండ్ పుట్టుకొచ్చింది. చాలా మంది కల్లు సేవించడానికి మొగ్గు చూపుతున్నారు.

కానీ..ఖమ్మం జిల్లాలోని గీత కార్మికులు విక్రయించే కల్లుపై అందరి దృష్టి పడింది. పండితాపురంలో గీతా కార్మికులు టెక్నాలజీను ఉపయోగిస్తున్నారు. ఆన్ లైన్ పద్ధతి ద్వారా కల్లును విక్రయిస్తున్నారు. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించడం చెప్పుకోదగ్గ విశేషం. 

ప్రకృతి సహజంగా వచ్చే కల్లుకు ఫుల్లు డిమాండ్ పెరిగింది. మద్యానికి అలవాటు పడిన వారు..కల్లుకు జై కొడుతున్నారు. ఎలాంటి రసాయనాలు కలుపకపోతుండడంతో చాలామంది పండితాపురానికి క్యూ కడుతున్నారు. ఫోన్ల ద్వారా మందే బుక్ చేసుకుంటున్నారని గీత కార్మికులు వెల్లడిస్తున్నారు. 

కల్లు పోసే సమయంలో సామాజిక దూరం పాటిస్తున్నామని, కల్లు సేవించడం వల్ల ఎంతగానో ఆరోగ్యంగా ఉందని పలువురు వెల్లడిస్తున్నారని కార్మికులు తెలిపారు. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి తాము ఇక్కడకు వచ్చి కల్లును సేవించడం జరుగుతోందని, చాలా టేస్టీగా ఉందని వినియోగదారుడు వెల్లడించారు. తనకు ఎలాంటి ప్రాబ్లం రాలేదని, తన కిడ్నీలో ఉన్న రాయి కూడా పోయిందన్నారు. కేవలం రూ. 150కు కల్లు బాటిల్ ఇస్తున్నారని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారని కితాబిచ్చారు. 

లాక్ డౌన్ నేపథ్యంలో కల్లు వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో మొత్తం 30 వేల మంది గీత కార్మికులున్నారు. వీరందరికీ కల్లే జీవనాధారం. ఈ వృత్తినే నమ్మకుంటూ జీవిస్తున్నారు. ప్రభుత్వం తమను మరింత ప్రోత్సాహించాలని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.  

See Also | ఇక కిక్కే కిక్కు…ఏపీలో 25శాతం పెరిగిన మద్యం ధరలు