Neeraj Chopra: నీరజ్ చోప్రాకు గాయం.. కామన్వెల్త్ గేమ్స్‌కు దూరం

ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్‌కు సంబంధించి భారత అథ్లెట్ల బృందానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఈ గేమ్స్‌కు స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా దూరం కానున్నాడు. వైద్యుల సూచన మేరకు నెల రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు.

Neeraj Chopra: నీరజ్ చోప్రాకు గాయం.. కామన్వెల్త్ గేమ్స్‌కు దూరం

Neeraj Chopra

Neeraj Chopra: రాబోయే కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు కచ్చితంగా పతకం అందిస్తాడని భావించిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఈ గేమ్స్‌కు దూరం కానున్నాడు. గాయం కారణంగా వైద్యులు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో నీరజ్ ఈ గేమ్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది భారత అథ్లెట్ల బృందానికి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.

Spurious Liquor: కల్తీ మద్యం సేవించి 25 మంది మృతి… మరో 40 మంది పరిస్థితి విషమం

కామన్వెల్త్ గేమ్స్ గురువారం నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో నీరజ్ చోప్రా వరుస విజయాలతో ఆకట్టుకుంటున్నాడు. గత ఒలంపిక్స్ సందర్భంగా భారత్‌కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రా.. ఆదివారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ థ్రో విభాగంలో సిల్వర్ మెడల్ కూడా సాధించాడు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న నీరజ్ ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించడం ఖాయమని అందరూ భావించారు. 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా నీరజ్ గోల్డ్ మెడల్ సాధించాడు. తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ గెలిచిన తర్వాత తనకు తొడల దగ్గర గాయం అయినట్లు చెప్పాడు.

Car Stunt: కారుతో స్టంట్ కోసం ప్రయత్నించిన డ్రైవర్.. డివైడర్ దాటి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

ఈ గాయాన్ని వైద్యులు పరిశీలించిన తర్వాతే తాను కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేది.. లేనిది తెలుస్తుందన్నాడు. తాజాగా అతడిని వైద్యులు పరీక్షించారు. ఎమ్ఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఈ అంశంపై ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ కూడా స్పందించింది. గాయం నుంచి నీరజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.