Nellore District Gang War: అగ్గిపెట్టె కోసం గ్రూపుల కొట్లాట.. ఒకరు హత్య!

ఒక్కోసారి అంతే.. చిన్న గొడవ పెద్దదై.. చిలికి చిలికి గాలివానగా మారి చివరికి గ్రూపులుగా మారి కొట్లాటకు దిగి హత్యల వరకు వస్తుంది. సరిగ్గా నెల్లూరు జిల్లాలో ఇదే ఘటన జరిగింది. చిన్న అగ్గిపెట్ట దగ్గర మొదలైన వివాదం కాస్త రెండు గ్రూపుల మధ్య గొడవగా మారి చివరికి ఒక నిండు ప్రాణం బలితీసుకుంది.

Nellore District Gang War: అగ్గిపెట్టె కోసం గ్రూపుల కొట్లాట.. ఒకరు హత్య!

Murder

Nellore District Gang War: ఒక్కోసారి అంతే.. చిన్న గొడవ పెద్దదై.. చిలికి చిలికి గాలివానగా మారి చివరికి గ్రూపులుగా మారి కొట్లాటకు దిగి హత్యల వరకు వస్తుంది. సరిగ్గా నెల్లూరు జిల్లాలో ఇదే ఘటన జరిగింది. చిన్న అగ్గిపెట్ట దగ్గర మొదలైన వివాదం కాస్త రెండు గ్రూపుల మధ్య గొడవగా మారి చివరికి ఒక నిండు ప్రాణం బలితీసుకుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి టూటౌన్ పరిధిలోని కచ్చేరిమిట్ట వద్ద ఉన్న కాలేజీ గ్రాండ్స్ ఈ గొడవకు వేదికైంది.

ఆదివారం మధ్యాహ్నం కొంతమంది యువకులు మద్యం తాగి ఈ కాలేజీ గ్రౌడ్స్ కు వచ్చారు. ఈ క్రమంలో జమీరుద్దీన్ అనే యువకుడు.. అక్కడే ఉన్న కొందరి వద్దకు వెళ్లి అగ్గిపెట్టే అడిగాడు. అంతే అవతలి వాళ్ళు మమ్మల్నే అగ్గిపెట్టె అడిగే దమ్ములొచ్చాయా అంటూ జమీరుద్దీన్ తో గొడవకి దిగారు. జమీరుద్దీన్ గ్యాంగ్ కూడా అవతలి వాళ్ళతో గొడవకి దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

ఈ క్రమంలోనే జమీరుద్దీన్ పై ప్రత్యర్థి గ్యాంగ్ బీరు బాయిల్ తో దాడిచేశారు. ముందుగా బీరు సీసాతో జమీరుద్దీన్ తలపై కొట్టిన గ్యాంగ్ సభ్యులు ఆ తర్వాత జమీరుద్దీన్ గొంతులో పొడిచారు. దీంతో జమీరుద్దీన్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. జమీరుద్దిన్ స్నేహితులు చంద్ర, పృథ్వీ ఈ గొడవలో తీవ్రంగా గాయపడ్డారు. కావలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న జమీరుద్దీన్ తండ్రి మొహిద్దీన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యర్థి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఆదివారం అగ్గిపెట్టె కోసమే మొదలైన ఈ గ్యాంగ్ వార్ కంటే ముందే ఈ రెండు గ్రూపుల మధ్య మనస్పర్థలు ఉండగా ఆదివారం క్షణికావేశంలో మరింత గొడవ ముదిరి ప్రాణం తీసేవరకు వచ్చింది. ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగవేటలో ఉన్న జమీరుద్దీన్ హత్య కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. యువత విచ్చలవిడిగా జులాయిగా మారి ఇలా గ్రూపులు కట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ ఉదంతాన్ని ఉదాహరించి పోలీసులు కోరుతున్నారు.