China: నేపాల్ స‌రిహ‌ద్దులో చైనా దురాక్ర‌మ‌ణ‌.. భూటాన్‌లోనూ ఇంతే.. భార‌త్‌కు ముప్పు

పొరుగు దేశాల‌పై చైనా త‌న‌ దుందుడుకు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. చుట్టుప‌క్క‌ల ఉండే దేశాల భూభాగాల‌ను కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ, అవి త‌మ భూభాగాలుగా చెప్పుకుంటోంది. నేపాల్‌, భూటాన్ లోనూ ఇటువంటి దురాక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతోంది. భారత్‌లోని సిక్కిం, సిలిగురి ప్రాంతాలపై వ్యూహాత్మకంగా బ‌ల‌ప‌డేందుకు చైనా భూటాన్ లో ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

China: నేపాల్ స‌రిహ‌ద్దులో చైనా దురాక్ర‌మ‌ణ‌.. భూటాన్‌లోనూ ఇంతే.. భార‌త్‌కు ముప్పు

India China

China: పొరుగు దేశాల‌పై చైనా త‌న‌ దుందుడుకు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. చుట్టుప‌క్క‌ల ఉండే దేశాల భూభాగాల‌ను కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ, అవి త‌మ భూభాగాలుగా చెప్పుకుంటోంది. నేపాల్‌, భూటాన్ లోనూ ఇటువంటి దురాక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతోంది. నేపాల్‌లోని రాష్ట్రీయ ఏక్తా అభియాన్‌ పౌర సంస్థ తాజాగా త‌మ ప్ర‌భుత్వానికి ఓ విజ్ఞాప‌న ప‌త్రాన్ని స‌మ‌ర్పించింది. నేపాల్ భూభాగాల విషయంలో చైనా చ‌ర్య‌లను అంత‌ర్జాతీయంగా ఎండ‌గ‌ట్టాలని భూ నిర్వ‌హ‌ణ మంత్రి శ‌శి శ్రేష్ఠ‌ను రాష్ట్రీయ ఏక్తా అభియాన్ అధ్య‌క్షుడు బిన‌య్ యాద‌వ్ కోరారు.

అంతేగాక‌, గోర్ఖాలోని చుమనువ్రీ రూర‌ల్ మునిసిపాలిటీ-1 ప‌రిధిలో రుయిలా స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనా అక్ర‌మంగా చొర‌బ‌డి కంచె వేసింద‌ని తెలిపారు. అంత‌ర్జాతీయ చ‌ట్టాలు, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నేపాల్ స‌రిహ‌ద్దుల్లోని ప‌లు ప్రాంతాల్లో చైనా ఆక్ర‌మ‌ణ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఈ తీరు నేపాల్‌-చైనా మ‌ధ్య ఉన్న స్నేహ బంధాన్ని అవ‌మానించ‌డ‌మే కాకుండా, నేపాల్ సార్వ‌భౌమ‌త్వానికి స‌వాలు విస‌ర‌డ‌మేన‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ చైనా దురాక్ర‌మ‌ణలు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. చైనా తీరుపై నేపాల్ ప్ర‌భుత్వం క‌ఠిన వైఖ‌రిని అవ‌లంబించాల‌ని కోరారు.

మ‌రోవైపు, భూటాన్‌లోనూ చైనా దురాక్ర‌మ‌ణ ప్ర‌య‌త్నాలు కొనసాగిస్తోంది. భారత్‌లోని సిక్కిం, సిలిగురి ప్రాంతాలపై వ్యూహాత్మకంగా బ‌ల‌ప‌డేందుకు చైనా ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తాజాగా ఈ వివ‌రాలు తెలిశాయి. డోక్లాంకు తూర్పున దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో చైనా గ్రామాన్ని నిర్మించింది. ఈ గ్రామం భూటాన్‌ భూభాగంలో ఉంది. ఆమో చూ నదీ తీరంలో దాదాపు 10 కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించింది. ఈ నదీ తీరంలో మరో గ్రామాన్ని నిర్మించి, ఇప్పుడు 3వ‌ గ్రామ నిర్మాణం కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది. దీంతో డోక్లాంలో చైనా బ‌లం పెరిగే ముప్పు ఉంది.

RRR : ఇలాంటి ఎంట్రీ ఎప్పుడూ చూడలేదు.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ వీడియో