#Boycott VikramVeda : నీ పని నువ్వు చూసుకో.. నీ సినిమా కూడా బాయ్ కాట్ చేస్తాం.. హృతిక్ కి నెటిజన్లు వార్నింగ్..
లాల్ సింగ్ చడ్డా సినిమా బాయ్ కాట్ పై అమీర్ ఖాన్, కరీనా కపూర్, మరికొంతమంది స్పందించారు. తాజాగా ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మద్దతుగా నిలిచాడు. లాల్ సింగ్ చడ్డా సినిమా చూసిన హృతిక్ రోషన్ సినిమా బాగుందంటూ ట్వీట్ చేశాడు.

#Boycott VikramVeda : ఇటీవల అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చడ్డాని చాలా మంది బహిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలో అమీర్ ఖాన్ దేశం గురించి నెగిటివ్ గా మాట్లాడటంతో ఆ వ్యాఖ్యలకుగాను అమీర్ ఖాన్ సినిమాని బాయ్ కాట్ చేశారు నెటిజన్లు. ఒకపక్క సినిమా ఫ్లాప్ అవ్వడంతో పటు ఈ బాయ్ కాట్ నిరసన సినిమాకి మరింత ఎఫెక్ట్ అయింది. తాజాగా ఈ బాయ్ కాట్ నిరసన మరో హీరోకి కూడా తగులుతుంది.
లాల్ సింగ్ చడ్డా సినిమా బాయ్ కాట్ పై అమీర్ ఖాన్, కరీనా కపూర్, మరికొంతమంది స్పందించారు. తాజాగా ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మద్దతుగా నిలిచాడు. లాల్ సింగ్ చడ్డా సినిమా చూసిన హృతిక్ రోషన్ సినిమా బాగుందంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో.. ”ఇప్పుడే లాల్ సింగ్ చడ్డా సినిమా చూశాను. ప్లస్‌లు, మైనస్‌లు మినహాయిస్తే ‘లాల్ సింగ్ చడ్డా’ అద్భుతంగా ఉంది. ఇటువంటి గొప్ప సినిమాని మిస్ అవ్వొద్దు. వెంటనే వెళ్లి చూడండి” అని పోస్ట్ చేశాడు.
Pragya Jaiswal : ఫ్రెండ్ పెళ్ళిలో ఎంజాయ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
దీంతో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాకి సపోర్ట్ గా ట్వీట్ చేయడంతో ఇప్పుడు నెటిజన్లు హృతిక్ రోషన్ ని టార్గెట్ చేశారు. చాలామంది హృతిక్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. అవునా అయితే ఈసారి నీ విక్రమ్ వేద వంతు, ముందు నీ సినిమా గురించి నువ్వు చూసుకో, విక్రమ్ వేద సినిమాని కూడా బాయ్‌కాట్ చేస్తాము, బాయ్ కాట్ విక్రమ్ వేద అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ వివాదంలోకి హృతిక్ ఎందుకు తలదూర్చాడు అంటూ ‘విక్రమ్ వేద’ నిర్మాతలు తలా పట్టుకున్నారట. మరి వచ్చే నెలలో రిలీజ్ అయ్యే ఈ సినిమాని బాయ్ కాట్ చేస్తారా అని సందేహిస్తున్నారు బాలీవుడ్ వర్గాలు.
Just watched LAAL SINGH CHADDA. I felt the HEART of this movie. Pluses and minuses aside, this movie is just magnificent. Don’t miss this gem guys ! Go ! Go now . Watch it. It’s beautiful. Just beautiful. ❤️
— Hrithik Roshan (@iHrithik) August 13, 2022