McDonald’s latest Ad : మెక్‌డొనాల్డ్స్ లేటెస్ట్ యాడ్ ఐడియా భయంకరంగా ఉందంటున్న నెటిజన్లు
ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ లేటెస్ట్ యాడ్ చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇలాంటి భయంకరమైన ఆలోచన ఎలా వచ్చిందని ట్రోల్ చేస్తున్నారు. వారి వద్ద పనిచేసే మహిళా సిబ్బందిని ఆక్షేపించినట్లుగా యాడ్ ఉందని అంటున్నారు.

McDonald new ad
McDonald’s latest Ad viral : వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవాలంటే ప్రకటనలు చాలా అవసరం. అదీ మెక్‌డొనాల్డ్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ దిగ్గజాలకు తప్పనిసరి. తాజాగా మెక్‌డొనాల్డ్స్ లేటెస్ట్ ఫుడ్ క్యాంపెయిన్ నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. యాడ్‌లో మహిళా సిబ్బందిని తక్కువ చేసి చూపించారని ఇది భయంకరమైన ఆలోచన అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Golden Retriever : యాడ్స్‌తో కోట్లు సంపాదిస్తున్న డాగ్
మెక్‌డొనాల్డ్స్ లేటెస్ట్ యాడ్‌లో ఒక వ్యక్తి మహిళా సిబ్బందికి మెక్‌వెజ్జీ ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు. ఆ సందర్భంలో ఇద్దరు నవ్వుకుంటారు. అతను ఫుడ్ తింటున్నప్పుడు ఉద్యోగి వైపు కొంటెగా చూస్తాడు. మళ్లీ ఆర్డర్ కోసం క్యూలో నిలబడతాడు. మేనేజర్ అతనిని ఆర్డర్ అడిగినపుడు అతని కౌంటర్‌కి వెళ్లడానికి నిరాకరిస్తాడు. మళ్లీ క్యూలో నిలబడతాడు. ‘కొన్ని సార్లు గొప్ప ప్రేమ కథలు చిన్న చిన్న విషయాలతో మొదలవుతాయి – ఒక చూపు, చిరునవ్వు, భోజనం.. మరియు కేవలం రూ.179 కి మీకు ఫుడ్ ఎలా వస్తుందో తెలుసుకోండి. మీకు సమీపంలోని మెక్ డొనాల్డ్ ని సందర్శిచండి.. రూ.179 కి మెక్ వెజ్జీ మీల్స్‌ని పొందండి’ అని మెక్‌డొనాల్డ్స్ ఇండియా ట్విట్టర్‌లో తమ యాడ్ లింక్‌ను షేర్ చేసింది.
ఈ యాడ్ నెటిజన్లకు నచ్చలేదు. ఇలాంటి యాడ్‌లు ఉద్యోగినులను వేధింపులకు గురి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అసలు ఈ యాడ్ చేయడమే భయంకరమైన ఆలోచన అని కామెంట్లు పెట్టారు. వీరి అభిప్రాయాలపై నిర్వాహకులు ఎలా స్పందిస్తారో మరి.
Sometimes, the greatest love stories start with the tiniest things – a glance, a smile, a meal. Watch this unusual date and find out how a meal can give you #MoreForLess at just Rs.179! Visit a McDonald’s near you and get McVeggie Meals @ Rs.179https://t.co/nXOWHHIgGZ
— McDonald’s India (@mcdonaldsindia) June 5, 2023