Odisha Cabinet: ఒడిశాలో మొత్తం కేబినెట్ రాజీనామా: నేడు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

2004 నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ పాలనలో స్పీకర్ సహా కేబినెట్ మొత్తం రాజీనామా చేయడం ఇదే తొలిసారి.

Odisha Cabinet: ఒడిశాలో మొత్తం కేబినెట్ రాజీనామా: నేడు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

Odisha

Odisha Cabinet: ఒడిశాలోని నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ప్రభుత్వంలోని మొత్తం 20 మంది కేబినెట్ మంత్రులు రాజీనామాలు చేశారు. స్పీకర్ సూర్య నారాయణ్ పాత్ర సహా మంత్రులందరూ రాజీనామాలు చేశారు. ఈనేపధ్యంలో ఆదివారం(June 5న) మధ్యాహ్నం 12 గంటలకు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. 2004 నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ పాలనలో స్పీకర్ సహా కేబినెట్ మొత్తం రాజీనామా చేయడం ఇదే తొలిసారి. 2019 ఎన్నికల అనంతరం దాదాపు మూడేళ్ళుగా రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ జరగలేదు. మే 29 నాటికి బీజేడీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అధికారం చేపట్టి మూడేళ్లు గడిచింది. దీంతో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని భావించిన సీఎం నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Other Stories: Telangana Corona Report News : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం

కొన్ని వివాదాల కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట ప్రశ్నార్థకంగా మారింది. మంత్రులు తమ రాజీనామాలను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించారు. ఒడిశా శాసనసభ స్పీకర్ సూర్య నారాయణ్ పాత్రో తొలుత తన రాజీనామాను సమర్పించారు. అనంతరం మంత్రులంతా రాజీనామా చేశారు. కాగా ఆదివారం కొత్త మంత్రి వర్గం ప్రమాణస్వీకారం జరగనుంది. ఒడిశా శాసనసభ కొత్త స్పీకర్ గా ఉషాదేవికి కేటాయించే అవకాశం ఉంది. అదే జరిగితే ఒడిశాకు తొలి మహిళా స్పీకర్ గా ఉషాదేవి నిలువనున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జూన్ 20 నుంచి విదేశాలకు వెళ్లనున్నారు. అంతకు ముందే తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేయాలని భావించారు.