COVID-19: భార‌త్ స‌హా ప‌లు దేశాల్లో బీఏ.2.75 వ్యాప్తి

భార‌త్‌తో పాటు ప‌లు దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ.2 ఉపరకం బీఏ.2.75 వ్యాప్తి జ‌రుగుతోంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌నామ్ చెప్పారు. దాని వ్యాప్తిని నిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు.

COVID-19: భార‌త్ స‌హా ప‌లు దేశాల్లో బీఏ.2.75 వ్యాప్తి

COVID-19

COVID-19: భార‌త్‌తో పాటు ప‌లు దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ.2 ఉపరకం బీఏ.2.75 వ్యాప్తి జ‌రుగుతోంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌నామ్ చెప్పారు. దాని వ్యాప్తిని నిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. అలాగే, రెండు వారాల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు 30 శాతం పెరిగాయని చెప్పారు. అమెరికా స‌హా యూర‌ప్‌లో బీఏ.4, బీఏ.5 వేరియంట్ల వ‌ల్ల క‌రోనా ఉద్ధృతి పెరిగింద‌ని వివ‌రించారు. భార‌త్ వంటి దేశాల్లో బీఏ.2.75ను గుర్తించిన‌ట్లు తెలిపారు.

Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్‌నాథ్ షిండే.. డ్ర‌మ్స్ వాయించిన భార్య ల‌త.. వీడియో

ఈ వేరియంట్‌కు కూడా అధిక సాంక్రమిక శక్తి ఉంటుంది. ఒమిక్రాన్‌ బీఏ.2 ఉపరకం బీఏ.2.75 వ్యాప్తి గురించి డ‌బ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్ర‌వేత్త సౌమ్య స్వామినాథ‌న్ స్పందిస్తూ… దీన్ని మొద‌టిసారిగా భార‌త్‌లో గుర్తించార‌ని, ఇప్పుడు 10 దేశాల్లో దాన్ని గుర్తించార‌ని తెలిపారు. బీఏ.2.75 గురించి అధ్య‌యనం చేయాల్సి ఉంద‌ని చెప్పారు. కాగా, బీఏ.2.75 వ్యాప్తి భారత్‌లో పరిమితమేనని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వ అధికార వర్గాలు తెలిపాయి. దీని వ‌ల్ల‌ ఇన్‌ఫెక్షన్ తీవ్ర‌త పెరుగుతుంద‌నడానికి స్ప‌ష్ట‌మైన ఆధారాలు లేవ‌ని చెప్పాయి.