New Crab Species : కర్ణాటకలో కొత్త జాతి పీత గుర్తింపు .. భారత్ లో ఇది 75వ పీత జాతి

కర్ణాటకలోని ఎల్లాపూర్‌లో ఒక కొత్త జాతి పీత వెలుగులోకి వచ్చింది. ఈ పీత రెండు రంగుల్లో భలే చూడముచ్చటగా ఉంది. 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు ఉన్న ఈ పీత రెండు రంగులతో సాధారణ పీతల కంటే విభిన్నంగా కనిపిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలో కనిపించిన ఈ పీతకు 'ద్వివర్ణ (Dwivarna)' అని నామకరణం చేశారు శాస్త్రవేత్తలు.

New Crab Species : కర్ణాటకలో కొత్త జాతి పీత గుర్తింపు .. భారత్ లో ఇది 75వ పీత జాతి

New crab species found near Karnataka's

New Crab Species: కర్ణాటకలోని ఎల్లాపూర్‌లో ఒక కొత్త జాతి పీత వెలుగులోకి వచ్చింది. ఈ పీత రెండు రంగుల్లో భలే చూడముచ్చటగా ఉంది. 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు ఉన్న ఈ పీత రెండు రంగులతో సాధారణ పీతల కంటే విభిన్నంగా కనిపిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలో కనిపించిన ఈ పీతకు ‘ద్వివర్ణ (Dwivarna)’ అని నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. మన భారతదేశంలో ఇప్పటివరకు కనిపెట్టిన 75వ పీత జాతి అని ద్వివర్ణ గురించి వివరించారు శాస్త్రవేత్తలు. స్వాతంత్ర్యం వచ్చి 75వ నిండిన సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్న ఆగస్టు 15వ తేదీనే ఈ 75వ జాతి పీతకు శాస్త్రీయంగా అంగీకారం లభించడం విశేషం.

2021 జూన్ 30న భారే అడవుల గుండా ప్రయాణిస్తున్న ఎల్లాపూర్ సమీపంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ గోపాల్ కృష్ణ హెగ్డే, కద్రా ఫారెస్ట్ గార్డ్ పరశురాం భజంత్రీలు రంగు రంగుల్లో ఉండి ఆకట్టుకున్న ఈ పీతను కనుగొన్నారు. ఈ మంచినీటి పీత చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో వారు చాలా ఆశ్చర్యపోయారు. దీని ఆ కొత్త పీత గురించి శాస్త్రవేత్తలకు చెప్పారు. అలా ఈ పీత వెలుగులోకి వచ్చింది. దీనిని కనుగొన్న సంవత్సరం తరువాత ఘటియానా ద్వివర్ణ (డైక్రోమాటిక్) అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇది రెండు రంగులలో ఉంది. ఈ పీత తల తెలుపు రంగులో ఉంటే దాని శరీరం ఊదారంగులో ఉంది.

ద్వివర్ణ పీతలు తినదగినవని కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి నాచు, లైకెన్‌లపై మనుగడ సాగిస్తాయి. డ్యూయల్-టోన్ కలిగిన ఈ పీత పశ్చిమ కనుమలలోని రాతి క్రస్ట్‌లో నీటి వనరుల మధ్య జీవిస్తుంటుందని తెలిపారు. ఇది అత్యంత ప్రత్యేకమైన పీతలలో ఒకటని హెగ్డే అన్నారు. అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా దీనిని ఒక ప్రత్యేకమైన జాతిగా నిర్ధారించింది. దాంతో హెగ్డే, భజంత్రీలకు ‘సిటిజన్ సైంటిస్ట్స్’ అనే బిరుదు లభించింది.

ఈ పీత గురించి హెగ్డే మాట్లాడుతూ ఇటువంటి రంగురంగుల పీతను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని అది చాలా ప్రత్యేకంగా ఉండటంతో వెంటనే కొన్ని ఫొటోలు, వీడియోలను తీసుకున్నామని… ఇలాంటి పీతల గురించి తెలుసుకోవటానికి గూగుల్‌లో వెతికిలా ఎటువంటి సమాచారం దొరకలేదని దీంతో ఇవి ప్రత్యేక జాతివి అని భావించి శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లామని హెగ్డే తెలిపారు.

ఈ విషయాన్ని వెరిఫై చేసుకోవడానికి వారు రిలయన్స్ ఫౌండేషన్‌కు నాయకత్వం వహిస్తున్నబాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో పనిచేసిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వరదగిరిని సంప్రదించారు. ఆ అనుభవంతో వరదగిరి ఈ పీతను అన్ని విధాల పరిశీలించి కొత్త జాతి కావచ్చునని అభిప్రాయపడ్డారు. మరింత సమాచారం కోసం పీతలపై ప్రత్యేకత కలిగిన శాస్త్రవేత్త, ఠాక్రే ఫౌండేషన్‌కు చెందిన తేజస్ థాక్రేని, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సమీర్ కుమార్ పతిలను సంప్రదించాలని సూచించారు.