New District Courts: రేపటి నుంచి కొత్త జిల్లాల కోర్టుల్లో సేవలు ప్రారంభం

తెలంగాణకు సంబంధించి న్యాయవ్యవస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఈ నెల 2 నుంచి 23 కొత్త జిల్లాల్లో ఏర్పాటైన కోర్టుల్లో సేవలు ప్రారంభమవుతాయి. ఒకేసారి 23 కోర్టుల సేవలు ప్రారంభం కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే మొదటిసారి.

New District Courts: రేపటి నుంచి కొత్త జిల్లాల కోర్టుల్లో సేవలు ప్రారంభం

New District Courts

New District Courts: తెలంగాణకు సంబంధించి న్యాయవ్యవస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఈ నెల 2 నుంచి 23 కొత్త జిల్లాల్లో ఏర్పాటైన కోర్టుల్లో సేవలు ప్రారంభమవుతాయి. ఒకేసారి 23 కోర్టుల సేవలు ప్రారంభం కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే మొదటిసారి. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కోర్టులు ఏర్పాటు చేయాలని గతంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మను సీఎం కేసీఆర్ కోరారు. ఇప్పటివరకు పాత జిల్లాల ప్రకారం పది జిల్లాల్లోనే కోర్టులు ఉండేవి. అయితే, తాజాగా మరో 23 జిల్లాల్లో కోర్టులు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఒకేసారి 33 జిల్లాల్లో కోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయి.

TV Actress Mythili: నా భర్తను కఠినంగా శిక్షించాలి: మైథిలీ రెడ్డి

పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసందే. ఇప్పుడా జిల్లాలు అన్నింట్లోనూ కోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయి. అన్ని జిల్లా కోర్టులకు జడ్జీలను నియమిస్తూ గతంలోనే ఉత్తర్వులు వెలువడ్డాయి. పోర్ట్‌ఫోలియో జడ్జీలను సైతం హైకోర్టు ఇప్పటికే నియమించింది. రేపు రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఉదయం పది గంటలకు అన్ని జిల్లా కోర్టుల్లో జాతీయ జెండాలను ఎగురవేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త కోర్టుల ఏర్పాటుతో న్యాయవ్యవస్థ మరింత వేగంగా పనిచేస్తుంది. కింది స్థాయిలో సత్వర న్యాయం జరుగుతుంది.