Kannada Heroins : టాలీవుడ్ కి క్యూ కడుతున్న కొత్త కన్నడ భామలు..

ఒకప్పుడు టాలీవుడ్ నిండా మల్లూ ముద్దుగుమ్మలే ఉండేవారు. ఇటు గ్లామర్ తో, అటు పెర్ఫార్మెన్స్ తో వావ్ అనిపించేవారు. కానీ ఇప్పుడు వారి ప్లేస్ ను కన్నడ బ్యూటీస్ రీప్లేస్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో సరికొత్తగా.............

Kannada Heroins : టాలీవుడ్ కి క్యూ కడుతున్న కొత్త కన్నడ భామలు..

Kannada Heroins :  ఒకప్పుడు టాలీవుడ్ నిండా మల్లూ ముద్దుగుమ్మలే ఉండేవారు. ఇటు గ్లామర్ తో, అటు పెర్ఫార్మెన్స్ తో వావ్ అనిపించేవారు. కానీ ఇప్పుడు వారి ప్లేస్ ను కన్నడ బ్యూటీస్ రీప్లేస్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో సరికొత్తగా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు ముంబై భామల హవా నడిచింది. ఆ తర్వాత కేరళ నారికేళాల రాక ఎక్కువైంది. నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్ ఆడియన్స్ కు వారే మస్తు ఎంటర్‌టైనర్స్. కానీ కొంత కాలంగా వారి స్థానాన్ని కన్నడ కస్తూరీలు ఆక్రమించుకుంటున్నారు. గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో జనానికి ఈజీగా కనెక్టర్స్ అయ్యారు. ప్రజెంట్ టాలీవుడ్ కన్నడ బ్యూటీస్ తో కళకళలాడిపోతోంది. మల్లూ భామలకు, ముంబై పోరీలకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేసేస్తున్నారు. ఇప్పటికే పూజ హెగ్డే, రష్మిక లాంటి బ్యూటీలు టాప్ హీరోయిన్స్ గా ఉంటే కొత్తగా మరింతమంది వచ్చారు, వస్తున్నారు కన్నడ నుంచి.

లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన కన్నడ కొత్త బ్యూటీ ఆషికా రంగనాథ్. కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. కల్యాణ్ రామ్ హీరోగా ‘అమిగోస్’ అనే సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆషిక రంగనాథ్ ను ఎంపిక చేశారు. 2016లో కన్నడ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలెట్టిన ఆషిక, అక్కడ పది సినిమాల వరకూ చేసింది. ఆమె గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

సత్యదేవ్, తమన్నా జోడీగా నటించిన వెరైటీ లవ్ స్టోరీ ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ డైరెక్షన్ లో సినిమా రూపొందుతోంది. లవ్ మాక్ టైల్ కన్నడ సూపర్ హిట్ సినిమాకిది అఫీషియల్ రీమేక్. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. అందులో ఒకరు మేఘా ఆకాశ్ అయితే మరో హీరోయిన్ కొత్త కన్నడ అమ్మాయి కావ్యా శెట్టి. ఇందులో హీరో లవ్ స్టోరీ మూడు దశల్లో నడుస్తుంది. ఒక్కో దశలోనూ ఒక్కో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కన్నడలో గ్లామరస్ హీరోయిన్ గా కావ్యాకి మంచి క్రేజ్. ఈ మూవీతో ఆమె టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుందని చెబుతున్నారు మేకర్స్.

రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో డబ్బింగ్ వెర్షన్ తో అట్రాక్ట్ చేసిన మరో కన్నడ గ్లామర్ బేబ్ శ్రీనిధి శెట్టి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన సూపర్ హిట్ సిరీస్ కెజీఎఫ్ లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. గ్లామర్ పరంగానూ, పర్ఫార్మెన్స్ పరంగానూ పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ నుంచి మంచి మార్కులు వేయించుకుంది. హీరోగా నటించిన రాక్ స్టార్ యశ్ జోడీగా అదరగొట్టిన అమ్మడికి ఈ సినిమా క్రెడిట్ తో టాలీవుడ్ లో కూడా అవకాశాలొస్తున్నాయి. ఆమె టాలీవుడ్ చిత్రం త్వరలోనే మొదలుకాబోతోంది.

‘ఉప్పెన’ మూవీతో టాలీవుడ్ ను తన అందంతో ముంచెత్తింది అందాల కృతి శెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు కూడా ఇదే ఎంట్రీ మూవీ. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాకు కృతి గ్లామర్ షో వల్లనే కుర్రకారు థియేటర్స్ కు పోటెత్తారు. అమ్మడి అందం, అభినయం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ మూవీ తెచ్చిపెట్టిన క్రేజ్ తో కృతి టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. హ్యాట్రిక్ హిట్స్ కూడా కొట్టేసింది. ఇటీవల పరాజయాలు ఎదురైనా ఆమెకు ఆఫర్స్ మాత్రం ఆగడం లేదు.

Shahrukh Khan : 15 ఏళ్లయింది.. నిన్నే చూస్తూనే ఉన్నాను.. దీపికా పదుకొనేకి స్పెషల్ ట్వీట్ చేసిన షారుఖ్..

లాస్టియర్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మరో శాండల్ వుడ్ గ్లామర్ గాళ్ శ్రీలీల. రావడం రావడమే ఈమె దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పడింది. గౌరీ రోణంకి డైరెక్షన్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ కు జోడీగా అమ్మడు నటించిన ‘పెళ్ళిసందడి’ మూవీ టాక్ తో సంబంధం లేకుండా కాసులు కురిపించింది. శ్రీలీల గ్లామర్ షో, కీరవాణి సంగీతంలోని పాటలు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ క్రేజ్ తో శ్రీలీలకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కాయి. వాటిలో రవితేజ జోడీగా నటించిన ‘ధమాకా’ రిలీజ్ కు రెడీ అయింది.