తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు, ఏ బ్రాండ్ మీద ఎంత పెరిగిందంటే

ఏపీలోనే కాదు పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ మద్యం షాపులు తెరుచుకున్నాయి. బుధవారం(మే 6,2020)

  • Published By: naveen ,Published On : May 6, 2020 / 08:50 AM IST
తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు, ఏ బ్రాండ్ మీద ఎంత పెరిగిందంటే

ఏపీలోనే కాదు పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ మద్యం షాపులు తెరుచుకున్నాయి. బుధవారం(మే 6,2020)

ఏపీలోనే కాదు పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ మద్యం షాపులు తెరుచుకున్నాయి. బుధవారం(మే 6,2020) ఉదయం 10గంటలకు మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల తర్వాత వైన్స్‌ షాపులు తెరుచుకోవడంతో.. మందుబాబులు షాపుల ముందు క్యూ కట్టారు. బుధవారం ఉదయాన్నే మద్యం షాపుల దగ్గరికి చేరుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్ లో నిల్చున్నారు. 

చీప్ లిక్కర్ పై 11శాతం, ఇతర బ్రాండ్లపై 16శాతం ధరలు పెంపు:
తెలంగాణలో 2,200 మద్యం దుకాణాలకు గానూ కంటైన్మెంట్‌ జోన్లలోని 15 దుకాణాలు మినహాయించి మిగిలిన వాటిని ఓపెన్‌ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కాగా, తెలంగాణలోనూ మద్యం ధరలు పెరిగాయి. చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, ఇతర బ్రాండ్ల 16 శాతం ధర పెంచింది ప్రభుత్వం. ఈ ప్రకారం కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి. ఇక బార్లు, పబ్‌లను తెరిచే ప్రసక్తి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

పెరిగిన మద్యం ధరలు:
ప్రతి బీర్‌పై రూ. 30 పెంపు
చీప్‌ లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 40 పెంపు
ఆర్డినరి లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 80 పెంపు
ప్రీమియం లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 120 పెంపు
స్కాచ్‌ లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 160 పెంపు

ఏపీలో 75శాతం మద్యం ధరలు పెంపు:
ఏపీలోనూ మద్యం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. కాగా ఏపీలో ఏకంగా 75శాతం మద్యం ధరలు పెంచారు సీఎం జగన్. మద్యం వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆ రేంజ్ లో ధరలు పెంచడానికి మొగ్గు చూపలేదు. మరీ అంత స్థాయిలో ధరలు పెంచితే కొంపలు అమ్ముకునే పరిస్థితి వస్తుందన్నారు. అసలే కరోనా కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఇప్పుడు అంత స్థాయిలో ధరలు పెంచి వారిపై మరింత భారం మోపడం ఇష్టం లేదన్నారు. ఈ క్రమంలో 16శాతం మేర ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

1
 

Also Read | తెలంగాణలో తెరుచుకున్న మద్యం షాపులు, బారులు తీరిన మందుబాబులు, కొత్త ధరలు ఇవే