Tollywood : సరికొత్త మల్టీస్టారర్‌లు.. కొత్తరకం కమర్షియల్ ప్లాన్..

RRR సినిమా తర్వాత టాలీవుడ్ లో మల్టీస్టారర్ల హడావిడి పెరిగింది. ఒకపక్క స్టార్డమ్ ఎంజాయ్ చేస్తూ, మరొక స్టార్ సినిమాలో స్పెషల్ రోల్ లేదా ఇంకో హీరోగా నటిస్తే ఆ కిక్కే వేరుంటది. స్టార్ హీరోలకే కాదు, సినీ లవర్స్ అందరూ............

Tollywood : సరికొత్త మల్టీస్టారర్‌లు.. కొత్తరకం కమర్షియల్ ప్లాన్..
ad

Multi Starers :  పాత కాలంలో స్టార్ హీరోలు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత హీరో స్టార్ డం కారణంతో స్టార్ హీరోలు కలిసి నటించడం మానేశారు. మళ్ళీ ఇప్పుడిపుడే మల్టీస్టారర్లు వస్తున్నాయి. ఒక పెద్ద హీరో, ఇంకో చిన్న హీరో కలిసి నటించడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. కానీ రాజమౌళి RRR సినిమా తర్వాత స్టార్ హీరోలతో మల్టీస్టారర్ల మీద మరింత నమ్మకం పెరిగింది. ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే ఆ ఇద్దరి అభిమానులతో కలెక్షన్లు కూడా బాగా వస్తాయని కమర్షియల్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్లు, నిర్మాతలు. ఒక హీరో సినిమాలో ఇంకో హీరో నటించి ఇండస్ట్రీలలో స్నేహపూర్వక వాతావరణం కూడా పెంచుతున్నారు.

RRR సినిమా తర్వాత టాలీవుడ్ లో మల్టీస్టారర్ల హడావిడి పెరిగింది. ఒకపక్క స్టార్డమ్ ఎంజాయ్ చేస్తూ, మరొక స్టార్ సినిమాలో స్పెషల్ రోల్ లేదా ఇంకో హీరోగా నటిస్తే ఆ కిక్కే వేరుంటది. స్టార్ హీరోలకే కాదు, సినీ లవర్స్ అందరూ ఫుల్ ఖుషీగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి కల్చరే ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తుంది. తమిళ్ లో రీసెంట్ గా వచ్చిన విక్రమ్ సినిమా సాధించిన విజయం ఇలాంటి కల్చర్ ని మరింత ఎంకరేజ్ చేస్తోంది.

Bollywood : కంగనా వర్సెస్ తాప్సీ.. బాలీవుడ్‌లో అంతర్యుద్ధం..

ప్రభాస్ కెరీర్ లో మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ గా వస్తోన్న పాన్ ఇండియా మూవీ సలార్. కేజిఎఫ్ 2తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ చైర్ లో కూర్చున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే ప్రకటన అధికారికంగా వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపైన మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్ పాన్ ఇండియా ఫ్యాన్స్ తో పాటు మలయాళం ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ లో స్పెషల్ క్యారెక్టర్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్, బాక్సింగ్ లెజెండరీ పర్సనాలిటీ మైక్ టైసన్ ను తీసుకొచ్చారు. దీంతో ఇండియాలోనే కాదు హాలీవుడ్ లో కూడా లైగర్ సినిమాపై పూరీ జగన్నాథ్ భారీ హైప్ పెంచారు. మైక్ టైసన్ ఎంట్రీ తో విజయ్ దేవరకొండ ఇమేజ్ కూడా పెరిగిపోయింది. బాలీవుడ్ సినీ పెద్దలు సపోర్ట్ చేయడంతో ఈ సినిమాకి భారీ కలెక్షన్లు ఆశిస్తున్నారు.

Prabhas : ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికే అంటున్న డైరెక్టర్..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ మూవీ అయిన లూసీఫర్ కు తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ వస్తోంది. అయితే లూసిఫర్ లో మోహన్ లాల్ కి సపోర్ట్ గా పృథ్విరాజ్ సుకుమారన్ పోషించిన క్యారెక్టర్ ను, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారు. దాంతో టాలీవుడ్ మెగాస్టార్, బాలీవుడ్ సూపర్ స్టార్ పక్కపక్కన నటిస్తే ఎలా ఉంటుందో అనే ఎగ్జైట్ మెంట్ ఇటు టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్ ఆడియన్స్ లో కూడా క్రియేట్ అయింది. చిరు, సల్మాన్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాకి కూడా పాన్ ఇండియా బిజినెస్ చేస్తున్నారు.

ఇక చిరంజీవి 154వ సినిమా బాబి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఫుల్ మాస్ మషాలాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. అధికారికంగా సమాచారం లేకపోయినా ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో మాస్ రాజా రవితేజ నటిస్తున్నాడు. ఈ సినిమాలో దాదాపు అరగంట పైగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి పక్కన చాలా రోజుల తర్వాత రవితేజ చేస్తుండటంతో ఈ మల్టీస్టారర్ పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఒకపక్క రాజకీయాలు, మరోపక్క సినిమాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు సినిమాలకి ఓకే చెప్పి ఉన్నారు పవన్. ఇటీవల డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో వినోదయా సీతం సినిమా రీమేక్ చేస్తున్నాడని, అందులో సాయిధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడని సమాచారం. అధికారికంగా రాకపోయినా సినిమా అయితే ఉందని సముద్రఖని చెప్పారు. ఇటీవల భీమ్లా నాయక్ సినిమాలో రానాతో కలిసి మల్టీస్టారర్ చేసిన పవన్ ఇపుడు సాయిధరమ్ తేజ్ తో చేస్తున్నాడు అనడంతో ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.