Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ

బాధితుల ఫోన్‌లోని నెంబర్లను సేకరించి స్నేహితులతో యువతుల డీపీలు పెట్టి వాట్సాప్‌ చాటింగ్‌ చేస్తూ వారికి నగ్న ఫోటోలు పంపుతున్నారు. వాటిని స్క్రీన్‌షాట్‌ తీసి మీ స్నేహితుడు డబ్బు కట్టలేదని.. మీరు కట్టాలంటూ వేధిస్తున్నారు.

Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ

Loan Apps

Loan Apps : హైదరాబాద్‌లో లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం వెలుగు చూసింది. లోన్ అడగకపోయినా నిర్వాహకులు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు. ఆ తర్వాత తిరిగి చెల్లించాలంటూ వేధిస్తున్నారు. ఏడు రోజుల్లో డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే వీరి బెదిరింపులు పెరిగిపోయాయి. ఇప్పటి వరకు రుణాలు తీసుకున్న వారినే వేధించిన కీచకులు, ఇప్పుడు వారి స్నేహితలు, బంధువులను టార్గెట్ చేశారు.

బాధితుల ఫోన్‌లోని నెంబర్లను సేకరించి స్నేహితులతో యువతుల డీపీలు పెట్టి వాట్సాప్‌ చాటింగ్‌ చేస్తూ వారికి నగ్న ఫోటోలు పంపుతున్నారు. వాటిని స్క్రీన్‌షాట్‌ తీసి మీ స్నేహితుడు డబ్బు కట్టలేదని.. మీరు కట్టాలంటూ వేధిస్తున్నారు. హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలో లోన్‌ యాప్‌ వేధింపుల కేసులు నమోదయ్యాయి. తాజాగా 90కి పైగా కేసులు నమోదు కాగా.. సైబరాబాద్‌లో 80కి పైగా, రాచకొండ పరిధిలో 30కి పైగా కేసులు నమోదయ్యాయి.

DHFL Scam : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్..DHFL​లో​ రూ.34,615 కోట్ల అవినీతి

సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో కీలక నిందితులు నేపాల్‌లో దాక్కున్నట్టు తేలింది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా కొందరికి వర్క్‌ ఫ్రమ్ హోం ఇచ్చి…వారితో బెదిరింపులకు పాల్పడుతోందని పోలీసులు గుర్తించారు. మరోవైపు, సైబర్‌ క్రైం పోలీసులు గూగుల్‌ సంస్థకు లేఖ రాశారు. 221 లోన్ యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.