KTR Ration Cards : గుడ్ న్యూస్.. జూలై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు

కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. జూలై 5 నుంచి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌న్నారు.

KTR Ration Cards : గుడ్ న్యూస్.. జూలై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు

Minister Ktr On Ration Cards

Minister KTR On Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. జూలై 5 నుంచి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌న్నారు. ఆస‌రా పెన్ష‌న్లు 10 రెట్లు పెంచామ‌న్న కేటీఆర్.. 57ఏళ్లు నిండిన వారికి త్వ‌ర‌లోనే పెన్ష‌న్లు ఇస్తామ‌న్నారు. దరఖాస్తు చేసుకున్ని పెండింగ్ లో ఉన్న 4.50లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని జూన్ 8న సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండ‌లం రాజుపేట‌లో 4వ విడత ప‌ల్లె ప్ర‌గ‌తిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేశారు. హ‌రిత‌హారంలో భాగంగా మొక్క‌లు నాటారు. 70 ఏళ్లలో జ‌ర‌గ‌ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఏడేళ్లలో చేసి చూపించామ‌ని
కేటీఆర్ తెలిపారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ల్లే మానేరు నిండింద‌న్నారు. చెరువుల నిండా నీళ్లు ఉండ‌టంతో మ‌త్స్య‌కారులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. స్వరాష్ట్రం వచ్చాకే చెరువులు బాగు ప‌డ్డాయ‌ని చెప్పారు. తెలంగాణ ఏర్ప‌డ్డాకే 24 గంట‌ల క‌రెంట్ వ‌చ్చింద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలోని 12వేల 769 గ్రామ పంచాయ‌తీల్లో ట్రాక్ట‌ర్, ట్యాంక‌ర్, న‌ర్స‌రీ ఏర్పాటు చేశామ‌న్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు స్ఫూర్తితో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చారని కేటీఆర్ అన్నారు. క‌రోనా స‌మ‌యంలో ఆక్సిజ‌న్ విలువ అంద‌రికీ తెలిసిందన్న కేటీఆర్.. ఊరంతా మొక్క‌లు నాటి పెంచాలని పిలుపునిచ్చారు. ప్ర‌తి ఇంట్లో ఒక్కొక్క‌రు క‌నీసం ఒక మొక్క నాటి పెంచాల‌ని సూచించారు. దేశంలోఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అన్నారు. రాష్ట్రంలో 40లక్షల మందికి పింఛన్ వస్తుందని కేటీఆర్ తెలిపారు.