Telangana Cabinet: మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తోన్న సీఎం కేసీఆర్

తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ అయింది. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో జరుగుతోన్న ఈ సమావేశంలో రాష్ట్రానికి, జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అద‌న‌పు వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌తో పాటు పలు అంశాల‌పై కేసీఆర్ చ‌ర్చలు జరుపుతారని ఇప్పటికే సీఎంవో ప్రకటించింది. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరుకాలేదన్న విషయం తెలిసిందే. ఆయా అంశాలు కూడా తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

Telangana Cabinet: మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తోన్న సీఎం కేసీఆర్

Kcr

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ అయింది. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో జరుగుతోన్న ఈ సమావేశంలో రాష్ట్రానికి, జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అద‌న‌పు వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌తో పాటు పలు అంశాల‌పై కేసీఆర్ చ‌ర్చలు జరుపుతారని ఇప్పటికే సీఎంవో ప్రకటించింది. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరుకాలేదన్న విషయం తెలిసిందే. ఆయా అంశాలు కూడా తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణకు అదనపు ఆర్థిక వనరులు, ఎఫ్‌ఆర్‌ఎంబీ ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా తీసుకునే రుణాల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధించడం వంటి అంశాలపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే, తెలంగాణలో కొత్త పెన్షన్లు, అనాథపిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా 75 మంది ఖైదీలను జైళ్ళ నుంచి విడుదల చేయడం వంటి అంశాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.

మునుగోడులో జరగాల్సిన ఉప ఎన్నిక, టీఆర్ఎస్ అనుసరించాల్సిన విధానాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అంశంపై టీఆర్ఎస్ దూకుడు పెంచే అవకాశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసిన అంశాలపై ఇవాళ రాత్రిలోపు ప్రకటన వచ్చే అవకాశముంది.

China-Taiwan conflict: యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయన్న చైనా.. సైనిక విన్యాసాలు చేపట్టిన తైవాన్