India vs New Zealand: రేపటి నుంచి కొత్త సిరీస్ ప్రారంభం.. శుక్రవారం న్యూజిలాండ్‌తో తొలి టీ20

టీ20 వరల్డ్ కప్ ముగిసిన వారం రోజుల్లోపే క్రికెట్ అభిమానుల కోసం మరో టోర్నీ సిద్ధమైంది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లూ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతాయి.

India vs New Zealand: రేపటి నుంచి కొత్త సిరీస్ ప్రారంభం.. శుక్రవారం న్యూజిలాండ్‌తో తొలి టీ20

India vs New Zealand: టీ20 వరల్డ్ కప్ ముగిసిన వారం రోజుల్లోపే ఇండియా మరో కొత్త సిరీస్ కోసం సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి.

Elon Musk: ట్విట్టర్‌కు త్వరలో కొత్త సీఈవో.. పదవికి గుడ్ బై చెప్పనున్న ఎలన్ మస్క్

న్యూజిలాండ్‌లోనే ఈ సిరీస్ జరుగుతుంది. నవంబర్ 18, శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 20, 22 తేదీల్లో మిగతా టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. తర్వాత నవంబర్ 25 నుంచి వన్డే సిరీస్ ఆరంభమవుతుంది. 25, 27, 30 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇప్పటివరకు ఇండియా-న్యూజిలాండ్ మధ్య 20 టీ20 మ్యాచ్‌లు జరగగా అందులో ఇండియా 11 గెలవగా, న్యూజిలాండ్ 9 గెలిచింది. ఇక ఇరు దేశాల మధ్య 110 వన్డే మ్యాచ్‪లు జరగగా ఇండియా 55 మ్యాచ్‪లు, న్యూజిలాండ్ 49 మ్యాచ్‪లు గెలిచింది. ఒక మ్యాచ్ టై కాగా, మరో ఐదింటి ఫలితం తేలలేదు. ఇండియా-న్యూజిలాండ్.. రెండు జట్లూ ఇటీవలి టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ వరకు చేరి ఓడిపోయాయి.

Hyderabad Traffic: హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు… ఏయే ప్రాంతాల్లో అంటే..

ఈ నేపథ్యంలో రెండు జట్లూ సమాన బలాబలాలతోనే ఉన్నాయి. ఇండియా మాత్రం ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక టీ20లకు ఇండియా తరఫున హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వన్డేలకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా కొనసాగుతారు. న్యూజిలాండ్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ కొనసాగుతారు. ఇంతకుముందు టోర్నీతో పోలిస్తే ఇరు జట్లూ స్వల్ప మార్పులే చేస్తున్నాయి.