న్యూయార్క్ లో కరోనా : ఇంట్లోనే ఉన్నారు..అయినా వైరస్ సోకింది..ఎలా

  • Published By: madhu ,Published On : May 12, 2020 / 05:12 AM IST
న్యూయార్క్ లో కరోనా : ఇంట్లోనే ఉన్నారు..అయినా వైరస్ సోకింది..ఎలా

ఇళ్లకే పరిమితమైన, వారికి కరోనా ఎలా సోకింది..కేవలం నిర్లక్ష్యంతోనే…  ఔను..మాస్క్‌లు ధరించకుండా.. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడంతోనే.. న్యూయార్క్‌లో  దాదాపు వెయ్యిమంది కొత్తగా గత వారం వైరస్ బారిన పడ్డారు.. వారంతా  నిత్యావసర వస్తువులు సరఫరా చేసే సంస్థల్లో పని చేసేవాళ్లు కాదు.. ఇంకే విధమైన ఎమర్జెన్సీ ఉద్యోగాలు చేసేవాళ్లు కాదు.. హెల్త్ వర్కర్లు అసలే  కాదు.. కనీసం రోడ్డుపైకి వచ్చినవాళ్లు కూడా కాదు..

మరి వీళ్లకి కరోనా ఎలా సోకింది..ఇదే ప్రశ్న వేసారు న్యూయార్క్ గవర్నర్ అండ్రూ క్యూమో..లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం కావాల్సిన వారు అలా చేయకుండా.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లనే ఇలా జరిగినట్లు న్యూయార్స్ స్టేట్ గవర్నర్ క్యూమో మండిపడ్డారు. వ్యక్తిగత శుభ్రత, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్‌లు ధరించని వారే ఇలా కరోనా బారిన పడ్డారంటూ అభిప్రాయపడ్డారాయన.. ఇది సరైన వైఖరి కాదన్నారు. 

కొన్ని రోజులుగా న్యూయార్క్ ‌లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో సృష్టించిన బీభత్సం నుంచి క్రమంగా కోలుకుంటుంది న్యూయార్స్ సిటీ.. లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపులు జరుగుతున్న వేళ సిచ్యూయేషన్‌ని అంచనా వేయడానికో..మరో కారణానికో గవర్నర్ క్యూమో న్యూయార్క్ రాష్ట్రంలోని హాస్పటల్స్‌పై ఓ సర్వే చేయించారు.. కొత్తగా వ్యాధి బారిన పడినవారి వివరాలు సేకరించి ఓ డేటా రిలీజ్ చేసారు.. దాని ప్రకారం గత వారం న్యూయార్క్‌లోని ఆస్పత్రులలో చేరిన వారిలో 66 శాతం ఇలా ఇళ్లకి పరిమితమైన వారేనని తేలింది. మరో 18శాతం మంది మాత్రం మాత్రమే నర్సింగ్ హోమ్స్‌లో పని చేసిన వారు.. 

న్యూయార్క్‌లో కేసులు తగ్గిపోయాయి. మరణాలు కూడా పెద్దసంఖ్యలో చోటు చేసుకోవడం లేదు. ఇలాంటప్పుడు ఇక లాక్‌డౌన్ అవసరం లేదనే వారి సంఖ్య పెరిగిపోతుంది. కానీ గవర్నర్ క్యూమో మాత్రం మే 15 వరకూ లాక్‌డౌన్ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో సడలింపులు ప్రారంభమైన ప్రతి చోటా భారీగా కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. అందుకే క్యూమో ప్రెస్‌మీట్ పెట్టి మరీ నగరపౌరులకు..రాష్ట్రపౌరులకు క్లాస్ పీకారు..వైరస్ విజృంభణ కళ్ల ముందు కన్పిస్తున్నా నిర్లక్ష్యం కూడదని హితవు పలికారు.

మే 6 నాటికి న్యూయార్క్ సిటిలో కేసుల సంఖ్య 3,21,000 కాగా 19877 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మాత్రం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పైగా న్యూయార్క్ సిటిలో మార్చి నుంచే లాక్‌డౌన్ అమలవుతోంది..అప్పట్నుంచి నమోదైన కేసుల సంగతి చూసినా.. 80శాతం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడలేదని చెప్తున్నారు.. ఇప్పుడు ఆ సంఖ్య 90శాతానికి చేరింది.. ప్రస్తుతం న్యూయార్క్ హాస్పటల్స్‌లో చేరేవారి వయసుని బట్టి చూస్తే.. 51 ఏళ్లు దాటిన వారు 73 శాతంగా సర్వే తేల్చింది.

Read More :

న్యూయార్క్ హాస్పిటల్ సిబ్బందికి బంపరాఫర్.. 3రోజుల ఫ్రీ లగ్జరీ టూర్

అమెరికాను వదిలి రష్యాపై విరుచుకుపడుతున్న కరోనా..రికార్డు స్థాయిలో కేసులు