న్యూయార్క్ హాస్పిటల్ సిబ్బందికి బంపరాఫర్.. 3రోజుల ఫ్రీ లగ్జరీ టూర్

  • Published By: Subhan ,Published On : May 12, 2020 / 03:43 AM IST
న్యూయార్క్ హాస్పిటల్ సిబ్బందికి బంపరాఫర్.. 3రోజుల ఫ్రీ లగ్జరీ టూర్

వేల మందికి సేవలు అందించిన న్యూయార్క్ హెల్త్ వర్కర్లకు అమెరికన్ ఎయిర్‌లైన్స్, హ్యాత్ హోటల్స్ అద్భుతమైన ఆఫర్ ను ముందుంచాయి. కరోనా మహమ్మారి పీడిస్తున్న సమయంలో జీవితాలను పణంగాపెట్టి సేవలందిస్తున్న వారికి థ్యాంక్యూ చెప్పుకునే ఉద్దేశ్యంతో ఈ ఏర్పాట్లు చేశారు.  NYC Health + Hospitals/Elmhursకు 2కంపెనీలు కలిసి సర్‌ప్రైజ్ ఇచ్చాయి. డాక్టర్ల నుంచి మొదలుకొని నర్సులు, ఫిజిషియన్ అసిస్టెంట్లు, ఫుడ్ సర్వీస్ వర్కర్లకు మూడు రోజుల వేకేషన్ కోసం విమానం టిక్కెట్లు, హోటల్స్‌లో రూంలు ఏర్పాటు చేయనున్నారు. 

ఈ గిఫ్ట్ ముఖ్య ఉద్దేశ్యం వర్కర్లు రీఛార్జ్ అవడంతో పాటు వారి కుటుంబాలతో రీ కనెక్ట్ అవుతారని.. వారి కోసం కూడా కాస్త సమయం వెచ్చిస్తారని.. కాంప్లిమెంటరీ కింద ఈ మూడు రోజుల వెకేషన్ ను ప్లాన్ చేశామని అమెరికన్ ఎయిర్ లైన్స్, హ్యాత్ హోటల్స్ ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశాయి. 

‘మా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది హెల్త్ కేర్ సంక్షోభంలో పనిచేసిసనందుకు ఆ రెండు మెగా కంపెనీలు ప్రశంసలు అందజేస్తున్నాయి. ఈ సదుపాయాన్ని వాడుకుంటాం. నూతన ఉత్తేజంతో తిరిగొచ్చి సేవలు అందిస్తామని NYC Health + Hospitals and CEO of NYC Health + Hospitals/Elmhurst వైస్ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ రోచా అన్నారు. 

అమెరికాలోని 50రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం న్యూయార్క్‌లోనే ఎక్కువగా ఉంది. న్యూయార్క్ టైమ్స్ డేటాబేస్ ఆధారంగా 3లక్షల 42వేల 317కేసులు నమోదుకాగా 26వేల 878మృతులు సంభవించాయి. NYC Health + Hospitals and CEO of NYC Health + Hospitals/Elmhurstకు చెందిన 4వేల మంది ఉద్యోగులు ఈ కాంప్లిమెంటరీ వేకేషన్‌కు అర్హులు. 

ప్రతి వర్కర్ అనూహ్యమైన అనుభవాల్ని ఎదుర్కొన్నాడు. కమ్యూనిటీని కాపాడుకోవడానికి ఎన్నో సేవలు చేశారు. ప్రతి పేషెంట్ ను దయతో, సమానత్వాన్ని చూపించి జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్లు బ్రేక్ తీసుకోవడానికి ఇదేసరైన సమయం అనుకుంటున్నాం. వర్కర్ కుటుంబాలకు, వారిని ప్రేమించేవాళ్లకు రీఛార్జి కింద ఉంటుందని భావిస్తున్నామని హాస్పిటల్ అధికారులు వెల్లడించారు. 

రోగులకు సేవలు అందించే క్రమంలో కాలిఫోర్నియా నుంచి 61ఏళ్ల నర్సు, న్యూయార్క్ నుంచి 48ఏళ్ల నర్సుల ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 1.3మిలియన్ కేసులు పైగా నమోదుకాగా 80వేల 95మృతులు సంభవించాయని న్యూయార్క్ టైమ్స్ లో కథనంలో ప్రచురించింది. 

Read Here>> అమెరికాను వదిలి రష్యాపై విరుచుకుపడుతున్న కరోనా..రికార్డు స్థాయిలో కేసులు