IND vs NZ 3rd ODI: కివీస్ లక్ష్యం 220 పరుగులు.. రాణించిన శ్రేయాస్, సుందర్.. 219 పరుగులకే టీమిండియా ఆలౌట్

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ బౌలర్ల దాటికి క్రిజ్‌లో ఎక్కువ సేపు నిలబడలేక పెవిలియన్ బాటపట్టారు. ఫలితంగా 47.3 ఓవర్లలో 219 పరుగులు మాత్రమేచేసి కివీస్‌కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

IND vs NZ 3rd ODI: కివీస్ లక్ష్యం 220 పరుగులు.. రాణించిన శ్రేయాస్, సుందర్.. 219 పరుగులకే టీమిండియా ఆలౌట్

Team india

IND vs NZ 3rd ODI: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ బౌలర్ల దాటికి క్రిజ్‌లో ఎక్కువ సేపు నిలబడలేక పెవిలియన్ బాటపట్టారు. ఫలితంగా 47.3 ఓవర్లలో 219 పరుగులు మాత్రమేచేసి కివీస్‌కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టీమిండియా బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (51), శ్రేయస్ అయ్యర్ (49) రాణించారు. మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.

IND vs NZ 3rd ODI: అయ్యో పంత్..! మరోసారి పేలువ బ్యాటింగ్‌తో నిరాశపర్చిన పంత్..

మూడు వన్‌డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం 3వ వన్డే మ్యాచ్ న్యూజీలాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగింది. టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ల దాటికి భారత్ బౌలర్లు పెవియన్ బాట పట్టారు. ఓపెనర్లు శభ్‌మన్ గిల్ (13) మాత్రమే చేశాడు. అనంతరం ధావన్, శ్రేయస్ అయ్యర్‌లు జట్టు స్కోర్ ను పెంచే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పరుగులు రాలేదు. 55 పరుగుల వద్ద ధావన్ (28) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. రిషబ్ పంత్ (10), సూర్యకుమార్ యాదవ్(6) తక్కువ స్కోర్ కే ఔట్ కావడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.

వికెట్లు పడినా నిలకడగా ఆడిన శ్రేయస్ అయ్యర్ (49) కూడా అవుట్ కావటంతో 26 ఓవర్లకు భారత్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (51) పరుగులతో రాణించగా.. మిగిలి బ్యాటర్లు పెద్దగా రాణించక పోయారు. ఫలితంగా భారత్ జట్టు 17.3 ఓవర్లకు 2019 పరుగులు మాత్రమే చేయగలిగింది.