T20 World Cup 2022: సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌ విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన బాబర్ సేన

టీ20 ప్రపంచకప్ మ్యాచులో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ గెలిచి, ఫైనల్ చేరింది. పాక్ కు న్యూజిలాండ్ 153 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. పాక్ ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ 57, బాబర్ అజాం 53 పరుగులతో పాక్ కు శుభారంభాన్ని అందించారు. అనంతరం మొహమ్మద్ హారిస్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. షాన్ మసూద్ 3 (నాటౌట్), ఇఫ్లిఖర్ అహ్మద్ 0 (నాటౌట్)గా నిలిచారు. 19.1 ఓవర్లలో పాక్ 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు తీసింది. దీంతో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

T20 World Cup 2022: సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌ విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన బాబర్ సేన

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ గెలిచి, ఫైనల్ చేరింది. పాక్ కు న్యూజిలాండ్ 153 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. పాక్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు. ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ 57, బాబర్ అజాం 53 పరుగులతో పాక్ కు శుభారంభాన్ని అందించారు. అనంతరం మొహమ్మద్ హారిస్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు.

షాన్ మసూద్ 3 (నాటౌట్), ఇఫ్లిఖర్ అహ్మద్ 0 (నాటౌట్)గా నిలిచారు. 19.1 ఓవర్లలో పాక్ 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు తీసింది. దీంతో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెన్ట్ బౌల్ట్ 2, శాంటర్ 1 వికెట్టు తీశారు. అంతకు ముందు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ లో ఫిన్ అలెన్ 4, డివోన్ కాన్వే 21, కానె విలియమ్సన్ 46, గ్లెన్ ఫిలిప్స్ 6, దరిల్ మిచెల్ 53, జేమ్స్ నీషం 16 పరుగులు చేసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.

పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2, మొహమ్మద్ నవాజ్ 1 వికెట్ తీశారు. రేపు సెమీఫైనలో ఇంగ్లండ్ తో టీమిండియా తలపడనుంది. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా సెమీఫైనల్ వెళ్తుందని అందరూ భావించారు. అయితే, నెదర్లాండ్ చేతిలో ఆ జట్టు అనూహ్యంగా ఓడిపోవడంతో సెమీఫైనల్ లోకి ప్రవేశించే అవకాశం పాక్ కు దక్కింది. టీమిండియా బలంగా ఉండడంతో రేపు ఇంగ్లండ్ తో జరిగే మ్యాచులో గెలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అదే జరిగితే ఫైనల్లో భారత్-పాక్ తలబడతాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..