India vs New Zealand Match: వర్షం ఎఫెక్ట్.. న్యూజీలాండ్ వర్సెస్ టీమిండియా రెండవ వన్డే రద్దు ..

హమిల్టన్ వేదికగా భారత్ - న్యూజీలాండ్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే రద్దైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి వరుణుడు ఆటంకం కలిగించడంతో పలుసార్లు అంపైర్లు ఆటను నిలిపివేశారు. 12.5 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో వర్షం తగ్గినా మ్యాచ్ ఆడే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అపైర్లు మ్యాచ్ రద్దు చేస్తూ ప్రకటించారు.

India vs New Zealand Match: వర్షం ఎఫెక్ట్.. న్యూజీలాండ్ వర్సెస్ టీమిండియా రెండవ వన్డే రద్దు ..

India vs New Zealand Match

India vs New Zealand Match: హమిల్టన్ వేదికగా భారత్ – న్యూజీలాండ్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే రద్దైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి వరుణుడు ఆటంకం కలిగించడంతో పలుసార్లు అంపైర్లు ఆటను నిలిపివేశారు. 12.5 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో వర్షం తగ్గినా మ్యాచ్ ఆడే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అపైర్లు మ్యాచ్ రద్దు చేస్తూ ప్రకటించారు. తొలుత టాస్ గెలిచి న్యూజీలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఓపెనర్లుగా శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రారంభించారు. 4.5 ఓవర్ల వద్ద వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేశారు. ఈ సమయంలో వర్షం రావడంతో అపైర్లు మ్యాచ్ ను కొద్దిసేపు నిలిపివేశారు.

India vs New Zealand: రేపే రెండో వన్డే.. న్యూజిలాండ్ చేతిలో వరుసగా ఓడిపోతున్న భారత్.. ఈ సారైనా విజయం దక్కేనా?

వర్షం తెరిపినివ్వడంతో  పిచ్ ను పరిశీలించిన అంపైర్లు 29 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా‌కు రెండో బంతికే గట్టిషాక్ తగిలింది. 5.1 ఓవర్ల వద్ద శిఖర్ ధావన్(3) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ఫెర్గూసన్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో 23 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రిజ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడాడు. శుభమన్ గిల్ (45), సూర్యకుమార్ యాదవ్ (34) వేగంగా ఆడటంతో 12.5 ఓవర్లకు భారత్ స్కోర్ 1 వికెట్ నష్టానికి 89 పరుగులకు చేరింది. ఈ క్రమంలో వర్షం పడటంతో మరళ మ్యాచ్ ను నిలిపివేయాల్సి వచ్చింది.

వర్షం భారీగా కురవడంతో మైదానంలో వర్షపు నీరు కొంతమేర నిలిచింది. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహించే అవకాశం లేకపోవటంతో అపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ జట్టు 1-0తో వెనుకబడిపోయింది. బుధవారం హాగ్లీ ఓవల్ క్రైస్ట్ చర్చ్ మైదానంలో మూడో వన్డే జరుగుతుంది. ఈ వన్డేలో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. భారత్ ఓడిపోతే సిరీస్ న్యూజీలాండ్ కైవసం అవుతుంది.