6 రోజుల కవలలకు కరోనా

  • Published By: madhu ,Published On : May 24, 2020 / 12:32 AM IST
6 రోజుల కవలలకు కరోనా

కరోనా ఎవరినీ వదలిపెట్టడం లేదు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారికి కూడా కరోనా వైరస్ సోకుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారి..దేశాలను చుట్టేసింది. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. భారతదేశంలో కూడా ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి సోకుతుండడంతో కేంద్రం విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో 6 రోజుల కవలలకు వైరస్ సోకడం అందర్నీ కలిచివేసింది.

తన పిల్లలకు వైరస్ ఉందనే విషయం తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటి వరకు గుజరాత్ లో వైరస్ సోకిన అతిపిన్న వయస్కులు కవలేనని వైద్యులు వెల్లడించారు. అయితే..ప్రస్తుతం ఈ కవలల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందంటున్నారు. మోలికూర్ గ్రామానికి చెందిన ఓ గర్భిణీకి ఇటీవలే కరోనా వైరస్ సోకింది. పరీక్షలు నిర్వహించని వైద్యులు వైరస్ ఉందని నిర్ధారించారు. 2020, మే 16న వాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చింది.

ఒకే కాన్పులో మగ బిడ్డ, ఆడ బిడ్డ జన్మించినందుకు కుటుంబసభ్యులు ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వారం రోజులకే తల్లికి సోకిన కరోనా పసికందులకు వచ్చిందని వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబసభ్యులు విచారంలో మునిగిపోయారు. మోలీకూర్ గ్రామంలో 93 కరోనా కేసులు నమోదయ్యాయి. త్వరగా కవలలు వైరస్ బారి నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. 

గుజరాత్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 396 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 13 వేల 669 కేసులు రికార్డయ్యాయి. భారతదేశంలో 1.18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. 41 వేల కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 13 వేల 967, గుజరాత్ లో 12 వేల 905 కేసులున్నాయి. శుక్రవారం ఉదయం నాటికి ఢిల్లీలో 11 వేల 659 వైరస్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని, రికవరీ రేటు శనివారం 41.39గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.