Omicron Name : కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ పేరు వెనుక..చైనా అధ్యక్షుడు పేరులో ‘ Xi ’కథాకమామీషు..

కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ పేరు వెనుక..చైనా అధ్యక్షుడు పేరులో ‘ Xi ’ Jinping‘ లో Xi ’కథాకమామీషు..

Omicron Name : కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ పేరు వెనుక..చైనా అధ్యక్షుడు పేరులో ‘ Xi ’కథాకమామీషు..

Omicron Named...china President ‘ Xi ’ Jinping (1)

Omicron Named.china president ‘ Xi ’ Jinping  : కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ పేరు వెనుక ఓ స్టోరీ ఉందని తెలుస్తోంది. ఈపేరుకు సంబంధించి ఓ సరికొత్త వివరణ హాట్ టాపిక్ గా మారింది. మనకు తుఫాన్లు వస్తే పేర్లు పెడతారనే విషయం తెలిసిదే. అలాగే వైరల్ లకు కూడా పేర్లు పెడతారనే విషయం తెలిసిందే. ఈక్రమంలో చైనాలోనే పుట్టిందని చెప్పుకుంటున్న వైరస్ కు ‘కోవిడ్-19 అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి ప్రపంచ దేశాల్ని గడగడలాడించింది. ఇప్పటికే పలు రూపాలుగా మారి హడలెత్తిస్తోంది. తాజాగా ఈ కరోనా ‘ఒమిక్రాన్’గా మారి ఆఫ్రికా దేశాలల్లో కలకలం సృష్టిస్తోంది. మరి ఈ ‘ఒమిక్రాన్’ అనే పేరు ఎలా వచ్చింది? దీనికి కారణమేంటీ? ఈ పేరు వెనుక ఉన్న అసలు కారణమేంటో తెలుసుకుందాం..

కొత్త రకాల వైరస్ లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీక్ వర్ణమాల ప్రకారం పేర్లు పెడుతోంది. అంటే తెలుగులో అ, ఆ, ఇ, ఈ మాదిరిగా.. గ్రీకు భాషలో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా లాగా అన్నమాట. అందులో డెల్టా వేరియంట్ సృష్టించిన విలయాన్ని మనం ఇంకా మర్చిపోలేకపోతున్నాం.తాజాగా వెలుగుచూసిన రకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించింది..దీన్ని ఆందోళన కలిగించే రకంగా అభివర్ణించింది. దానికి ఒమిక్రాన్ (Omicron) అంటూ పేరు (నామకరణం) పెట్టింది. దీనిపై హార్వర్డ్ మెడికల్‌ కాలేజ్‌కు చెందిన మెడిసిన్ ప్రొఫెసర్ మార్టిన్ కుల్డార్ఫ్‌ సరికొత్త వివరణ ఇచ్చారు.

Read more : Omicron: “ఒమిక్రాన్”.. డెల్టాను మించిన డేంజర్ వేరియంట్‌కు పేరు పెట్టిన WHO

గ్రీకు వర్ణమాల ప్రకారం కొత్త వేరియంట్‌కు ‘Nu’ అని పేరు పెట్టాల్సి ఉందన్నారు. వర్ణమాలలో ‘Nu’ తర్వాత వచ్చే అక్షరం ‘Xi’. మళ్లీ కొత్త వేరియంట్‌ ఏదైనా వస్తే.. దానికి ‘Xi’ అని పెట్టాల్సి వస్తుంది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనా అధ్యక్షుడి పేరు షీ జిన్‌పింగ్ (Xi Jinping). ఆయన పేరులో ‘Xi’ ఉంది. ఆ పరిస్థితిని దాటవేయటానికి ఆ రెండింటి తర్వాతి అక్షరం ఒమిక్రాన్‌ను పెట్టినట్టు వివరించారు.

ఇప్పటికే కరోనా వైరస్‌కు మూలం చైనానే అని అంతర్జాతీయంగా పలు దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షడు ట్రంప్ అయితే ఇది ముమ్మాటికి చైనా వైరస్సే అని పదే పదే చెప్పేవారు. కానీ ఈ ఆరోపణల్ని చైనా ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తునే ఉంది. దీనిపై ఆరోగ్య సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ బృందం చేపట్టిన దర్యాప్తుకు చైనానుంచి ఏమాత్రం సహకారం అందలేదు. దాంతో కరోనా అసలు మూలం ఏంటో ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ క్రమంలో కరోనా వేరియంట్‌కు ‘Xi’ అని పేరు పెడితే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది.

Read more : Corona New Variant : ప్రపంచదేశాల్లో మళ్లీ కరోనా టెన్షన్..దక్షిణాఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’