రాబోయే 6 నెలలు వెరీ డేంజరస్.. బి కేర్ ఫుల్ అంటున్న బిల్‌ గేట్స్‌

  • Published By: sreehari ,Published On : December 15, 2020 / 06:33 AM IST
రాబోయే 6 నెలలు వెరీ డేంజరస్.. బి కేర్ ఫుల్ అంటున్న బిల్‌ గేట్స్‌

Six months Could be Worst of COVID-19 Pandemic : రాబోయే 6నెలలు చాలా ప్రాణాంతకమంటున్నారు మైక్రోసాఫ్ట్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. అమెరికాలో రాబోయే 4 నుంచి 6 నెలల్లోక రోనా మహమ్మారి మరింత ప్రాణంతకంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. IHME (Institute for Health Metrics and Evaluation) అధ్యయనం ప్రకారం.. రానున్న రోజుల్లో 2 కోట్లు అదనంగా కరోనా మరణాలు సంభవించవచ్చనని బిల్ గేట్స్ హెచ్చరించారు. గేట్స్‌కు సంబంధించిన ‘బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌’ కోవిడ్‌–19 కు వ్యాక్సిన్ తయారీలో భాగస్వామిగా కొనసాగుతోంది.

‘అమెరికాలో రానున్న 4 నుంచి 6 నెలలు కరోనా మహమ్మారి ముప్పు భారీగా పెరిగే ప్రమాదముంది. ఐహెచ్‌ఎంఈ(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఇవాల్యుయేషన్‌) అధ్యయనం ప్రకారం అదనంగా 2 లక్షల వరకు మరణాలు సంభవించవచ్చు. ముందు జాగ్రత్త చర్యగా అందరూ మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి తప్పకుండా నిబంధనలు పాటిస్తే కరోనా మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు. కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉందని 2015లోనే బిల్‌ గేట్స్‌ హెచ్చరించారు.

తన అంచనా కన్నా కరోనా వైరస్‌ మరింత ప్రాణాంతకంగా ఉందని గేట్స్‌ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలోని అందరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో అమెరికా సాయం ఎంతో అవసరమన్నారు. అమెరికాకు స్వార్థం సరికాదన్నారు. కోవిడ్-19 వల్ల ఇప్పటివరకు అమెరికాలో 2,90,000 మందికి పైగా మరణాలు సంభవించాయి.

టీకాల కోసం బిల్ గేట్స్ ఫౌండేషన్ పరిశోధనలకు నిధులు సమకూరుస్తోందని బిల్ గేట్స్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కరోనా మరణాలను తగ్గించాలని కోరుకుంటున్నామన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా ఈ టీకాలపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతారని ఆశిస్తుని చెప్పారు. తాను కూడా ఈ టీకాను బహిరంగంగా తీసుకుంటానని బిల్ గేట్స్ స్పష్టం చేశారు.