National Green Tribunal: భూగర్భ జలాల నియంత్రణపై కేంద్ర మార్గదర్శకాలను తప్పుబట్టిన ఎన్జీటీ

దేశంలో భూగర్భ జలాల వెలికితీత నియంత్రణకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది.

National Green Tribunal: భూగర్భ జలాల నియంత్రణపై కేంద్ర మార్గదర్శకాలను తప్పుబట్టిన ఎన్జీటీ

Ngt

National Green Tribunal: దేశంలో భూగర్భ జలాల వెలికితీత నియంత్రణకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. పాత స్కీమ్‌కు చిన్న వ్యత్యాసాలు, మార్పులు మరియు సవరణలను చేర్చి కొత్తగా మేకప్ వేశారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్రంపై కస్సుబుస్సులాడింది. ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ ఎకె గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ “2020 మార్గదర్శకాల ప్రకారం” కేంద్రానికి నిరంతరం ఇచ్చిన ఆదేశాలు స్థూలంగా సంతృప్తిపరచలేకుండా ఉన్నాయని పేర్కొంది. 2020 మార్గదర్శకాల్లో సారూప్యత ఏమి కనబడలేదని.. పాత మార్గదర్శకాలకే మెరుగులుదిద్దిన కేంద్రం..భూగర్భ జలాల సంరక్షణకు మూల కారణాలను రూపొందించడంలో విఫలమైందని ఎన్జీటీ బృందం విమర్శించింది. భూగర్భ జలాల రక్షణ మరియు సంరక్షణతో పాటు, జలాలు అడుగంటి పోకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు, పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలు పై జలశక్తిశాఖ సమర్థవంతమైన ప్రయత్నాలు చేయడం లేదని ఎన్జీటీ ఆక్షేపించింది.

Also read: Uttar Pradesh Election 2022 : యూపీ ఐదో విడత పోలింగ్ రేపే.. 61 స్థానాలు, 692 మంది అభ్యర్థులు

జలశక్తి మంత్రిత్వశాఖ అలసత్వం కారణంగా నీటిని అమ్ముకుంటున్న(ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీలు) వ్యాపార సంస్థలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని..ఎమ్ఎస్ఎమ్ఇ సంస్థలుగా పేర్కొంటూ..పరిమితికి మించి నీటిని తోడుకుంటున్నాయని ఎన్జీటీ పేర్కొంది. మరీ దారుణంగా భూగర్భ జలాలు పూర్తిగా తుడుచిపెట్టుకుపోతున్న ప్రాంతాల్లోనే ఈ తీవ్రత ఎక్కువగా ఉందని ఎన్జీటీ పేర్కొంది. క్లిష్టమైన, పాక్షిక క్లిష్టమైన ప్రాంతాల్లో ఈ సమస్య కాస్త అదుపులోనే ఉన్నా..కేంద్రం నియంత్రణ లేకపోవడం అక్కడి భూగర్భ జలాల సంరక్షణపై కొంత ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని ఎన్జీటీ ధర్మాసనం పేర్కొంది. “2015 మార్గదర్శకాల ప్రకారం, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలలో, ఏదైనా నీటి ఆధారిత పరిశ్రమకు NOC ఇవ్వకూడదు. కానీ ప్రస్తుతం ప్యాకేజ్డ్ వాటర్ పరిశ్రమలకు మాత్రమే NOC పరిమితమవగా..సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఎటువంటి ఆంక్షలు లేవు.

Also read: UN Security Council : యుఎన్ భద్రతా మండలి అంటే ఏంటి? యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఎలా అడ్డుకోగలదు?

ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తూ ఆయా నీటి ఆధారిత పరిశ్రమలకు(MSMEలు) ఎటువంటి కారణం లేకుండా తీవ్ర సడలింపులు ఇవ్వడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన గణాంకాలను పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ ధర్మాసనం ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని, ఎండాకాలం వచ్చిందంటే ఢిల్లీ మరియు రాజధాని పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అందుబాటులో ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఈ సమస్యను అధిగమించేందుకు.. పర్యావరణ మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, CGWA, UPGWD మరియు సంబంధిత జిల్లాల మేజిస్ట్రేట్‌లతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది ఎన్జీటీ. కమిటీ రెండు నెలల్లో పునరుద్ధరణ ప్రణాళికను సిద్ధం చేసి, వచ్చే ఆరు నెలల్లో అమలు చేసి, దానికి సమ్మతించే నివేదికను సమర్పించాలని ఎన్జీటీ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.

Also read: Plant Based Covid Vaccine : మొక్కల ఆధారిత కరోనా వ్యాక్సిన్ కు కెనడా ఆమోదం..త్వరలోనే అందుబాటులోకి