Nidhi Agarwal : ‘హీరో’ కోసం నిధి పారితోషికం ఎంతో తెలుసా?

నిధి అగర్వాల్ తాజాగా 'హీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. నిధి సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో తన ఫొటో షూట్స్ తో కుర్రాళ్లలో హీట్ పెంచుతుంది. నిధి అగర్వాల్.........

Nidhi Agarwal : ‘హీరో’ కోసం నిధి పారితోషికం ఎంతో తెలుసా?

Nidhi Agarwal

Nidhi Agarwal :   ఒకపక్క టాలీవుడ్, సౌత్ హీరోలు 30, 40 కోట్ల వరకు పారితోషికాలు తీసుకుంటుంటే హీరోయిన్స్ మాత్రం ఇంకా 10 కోట్లు కూడా తీసుకోవట్లేదు. కానీ ఇటీవల హీరోయిన్స్ కూడా పారితోషికాలు భారీగానే పెంచేశారు. కొత్త హీరోయిన్స్ కూడా ఒక సినిమా హిట్ అయితే పారితోషికాన్ని అమాంతం పెంచేస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా తన పారితోషికాన్ని పెంచేసింది.

నిధి అగర్వాల్ తాజాగా ‘హీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. నిధి సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో తన ఫొటో షూట్స్ తో కుర్రాళ్లలో హీట్ పెంచుతుంది. నిధి అగర్వాల్ ఇప్పటి వరకు 50 లక్షల నుండి 80 లక్షల వరకు పారితోషికం తీసుకుంటుంది. కాని తాజాగా వచ్చిన ‘హీరో’ సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా నటించేందుకు ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

Rajshekar-Mohan Babu : రాజశేఖర్, మోహన్ బాబు మల్టీస్టారర్ సినిమా అలా మిస్ అయింది..

మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో సంక్రాంతికి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి లిప్ కిస్ కూడా చేసింది. కొత్త హీరోతో రొమాన్స్ కూడా బాగానే చేసింది. రొమాన్స్ ఉండటంతో పాటు కొత్త హీరో కావడంతో బాగానే డిమాండ్ చేసింది నిధి. నిర్మాతలు కూడా నిధి అడిగిన దానికి ఒప్పుకొని కోటిన్నర వరకు ఇచ్చారని సమాచారం. మొత్తానికి నిధి కూడా కోటి రూపాయల క్లబ్ లో జాయిన్ అయింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’లో నటిస్తుంది.