Nikhil : కార్తికేయ 2 సరికొత్త ప్రమోషన్స్.. ట్రెజర్ హంట్.. బంగారు కృష్ణుడి విగ్రహాలు గెలుచుకోండి..

ప్రమోషన్స్ లో కొత్తదనం చూపిస్తున్నారు కార్తికేయ 2 చిత్ర యూనిట్. తాజాగా ట్రెజర్ హంట్ నిర్వహిస్తున్నామని, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్ సిటీలలో 6 లక్షల రూపాయల విలువైన నిజమైన బంగారు శ్రీకృష్ణ విగ్రహాలను......

Nikhil : కార్తికేయ 2 సరికొత్త ప్రమోషన్స్.. ట్రెజర్ హంట్.. బంగారు కృష్ణుడి విగ్రహాలు గెలుచుకోండి..

Karthikeya 2

Karthikeya 2 : నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కార్తికేయ 2 సినిమాని తెరకెక్కించారు. ఈ సారి సినిమాని మరింత కొత్త కథతో, మరింత సస్పెన్స్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు చిత్ర యూనిట్.

Kalyan Ram : బింబిసార పార్ట్ 2లో ఎన్టీఆర్ లేడు.. తిరుపతిలో కళ్యాణ్ రామ్ ప్రెస్ మీట్..

ప్రమోషన్స్ లో కొత్తదనం చూపిస్తున్నారు కార్తికేయ 2 చిత్ర యూనిట్. తాజాగా ట్రెజర్ హంట్ నిర్వహిస్తున్నామని, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్ సిటీలలో 6 లక్షల రూపాయల విలువైన నిజమైన బంగారు శ్రీకృష్ణ విగ్రహాలను దాచిపెడుతున్నామని, వాటిని కనిపెట్టి చెప్తే ఆ బంగారు శ్రీకృష్ణుడి విగ్రహం సొంతం చేసుకోవచ్చు అని, దానికి కొన్ని క్లూలు కూడా ఇస్తామని తెలిపారు. ఆ క్లూలు ఒక్కొక్కటిగా వదులుతామని తెలిపారు. ఇదంతా హీరో నిఖిల్ స్వయంగా ముందుండి నడిపిస్తున్నారు. తన సోషల్ మీడియాలో వీటి గురించి పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ బంగారు విగ్రహాలు సొంతం చేసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సరికొత్త ప్రమోషన్స్ తో కార్తికేయ 2 సినిమాకి ఏ మాత్రం ప్లస్ అవుతుందో చూడాలి.