Nikki Galrani : నేను ప్రగ్నెంట్ కాదు మహాప్రభో.. ఇంకెందుకు డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి.. రూమర్స్ కి సమాధానమిచ్చిన నిక్కీ గల్రాని..

 ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవలే వివాహం చేసుకున్నారు. తెలుగు, తమిళ్ సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇద్దరూ..............

Nikki Galrani : నేను ప్రగ్నెంట్ కాదు మహాప్రభో.. ఇంకెందుకు డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి.. రూమర్స్ కి సమాధానమిచ్చిన నిక్కీ గల్రాని..

Nikki Galrani reacts on her pregnancy news

Nikki Galrani :  ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవలే వివాహం చేసుకున్నారు. తెలుగు, తమిళ్ సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇద్దరూ ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు మ్యారేజ్ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు. అయితే గత కొన్నిరోజులుగా తెలుగు, తమిళ మీడియాలో నిక్కీ గల్రాని ప్రెగ్నెంట్ అనే వార్తలు వచ్చాయి.

Ira Khan : ప్రేమించినవాడితో ఘనంగా అమీర్‌ఖాన్ కూతురి నిశ్చితార్థం..

దీంతో చాలా మంది ఇది నిజమనుకొని వారికి కంగ్రాట్స్ కూడా చెప్తున్నారు. అయితే తాజాగా దీనిపై నిక్కీ గల్రాని స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ వార్తలపై స్పందిస్తూ.. ”ఈ విషయం నాకే తెలీదు. కొంతమంది నేను ప్రెగ్నెంట్ అనే వార్తని వైరల్ చేశారు. వాళ్ళే కొంచెం నా డెలివరీ డేట్ కూడా చెప్పేయండి. నేను ప్రెగ్నెంట్ ని కాదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే ఆ వార్త ముందుగా నేనే చెప్తాను. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయకండి” అని పోస్ట్ చేసింది.