Toilet Facility: 19 శాతం ఇండ్లకు టాయిలెట్ల సౌకర్యం లేదు: కేంద్ర సర్వే

దేశంలో ఇంకా 19 శాతం ఇండ్లకు మరుగుదొడ్లు లేవని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) తేల్చింది. 2019-21 వరకు జరిపిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

Toilet Facility: 19 శాతం ఇండ్లకు టాయిలెట్ల సౌకర్యం లేదు: కేంద్ర సర్వే

Toilet Facility

Toilet Facility: దేశంలో ఇంకా 19 శాతం ఇండ్లకు మరుగుదొడ్లు లేవని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) తేల్చింది. 2019-21 వరకు జరిపిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాగా, 2019లోనే భారత్‌ను బహిరంగ మల విసర్జన లేని దేశంగా ప్రకటించింది కేంద్రం. అయితే, దీనికి విరుద్ధంగా తాజా ఫలితాలు ఉండటం విశేషం. గతంతో పోలిస్తే దేశంలో బహిరంగ మల విసర్జన చేసే వాళ్ల శాతం మాత్రం తగ్గింది. ఇది 2015-16లో 39 శాతం ఉండగా, 2019-21లో 19 శాతంగా ఉంది. తక్కువ మరుగుదొడ్లు కలిగి ఉన్న రాష్ట్రాల్లో బిహార్ 62 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, ఝార్ఖండ్ 70 శాతం, ఒడిశా 71 శాతంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 69 శాతం ఇండ్లకు మెరుగైన టాయిలెట్ల సౌకర్యం ఉందని, వేరేవాళ్లతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదని సర్వే తేల్చింది.

Indian Army : అర్ధరాత్రివేళ నదిలో చిక్కుకున్న యువకులను కాపాడిన ఆర్మీ

మొత్తం 83 శాతం ఇండ్లకు టాయిలెట్ సౌకర్యం ఉండగా, 69 శాతం ఇండ్లకు మెరుగైన, సొంతంగా మాత్రమే వాడుకునే టాయిలెట్లు ఉన్నాయి. 58 శాతం ఇండ్లకు సరఫరా అవుతున్న నీరు తాగేందుకు పనికిరాకుండా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 66 శాతం నీళ్లను శుభ్రం చేసుకోకుండా వాడుతుంటే, పట్టణాల్లో 44 శాతం ఇండ్లలోని నీళ్లను శుభ్రం చేసుకోకుండానే వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లను వేడి చేయడం, గుడ్డ ముక్కలతో వడకట్టడం వంటివి ఎక్కువగా చేస్తున్నారు.