Indian Army Gets New Weapons : చైనాకు చుక్కలే..! ఇండియన్ ఆర్మీకి అధునాతన వెపన్స్

దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ భారత ఆర్మీని మరింత పటిష్టం చేసింది రక్షణ శాఖ. చైనాకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీకి అధునాతన వెపన్స్ అందించారు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. తూర్పు లద్దాఖ్ లో సైన్యానికి యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్ నిపుణ్ తో పాటు ల్యాండింగ్ అటాక్ క్రాఫ్ట్ ను, సరికొత్త బోటును కూడా అందించారు. ఇవన్నీ కూడా మేడిన్ ఇండియా ఆయుధాలే కావడం విశేషం.

Indian Army Gets New Weapons : చైనాకు చుక్కలే..! ఇండియన్ ఆర్మీకి అధునాతన వెపన్స్

Indian Army Gets New Weapons : దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ భారత ఆర్మీని మరింత పటిష్టం చేసింది రక్షణ శాఖ. చైనాకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీకి అధునాతన వెపన్స్ అందించారు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. తూర్పు లద్దాఖ్ లో సైన్యానికి యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్ నిపుణ్ తో పాటు ల్యాండింగ్ అటాక్ క్రాఫ్ట్ ను, సరికొత్త బోటును కూడా అందించారు. ఇవన్నీ కూడా మేడిన్ ఇండియా ఆయుధాలే కావడం విశేషం.

ఇక పాంగాంగ్ సరస్సులో పెట్రోలింగ్ కోసం ఈ కొత్త బోట్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఒకేసారి 35 ట్రూప్స్ వెళ్లేలా కొత్త బోట్లను డిజైన్ చేశారు. సరస్సు పరిసర ప్రాంతాలకు ఈ బోట్లు క్షణాల్లో చేరుకుంటాయి. అధునాతన వెపన్స్, సరికొత్త బోట్లు అందడంతో పాటు మేడిన్ ఇండియా డిఫెన్స్ సిస్టమ్ తో తూర్పు లద్దాఖ్ లో భారత ఆర్మీ ఫుల్ జోష్ లో ఉంది.

 

ఇండియన్ ఆర్మీ చేతికి అధునాతన ఆయుధాలు..

ఆర్మీకి చెందిన F-INSAS సైనికుడు AK-203 అసాల్ట్ రైఫిల్‌ సహా కొత్త ఆయుధ వ్యవస్థల గురించి రాజ్‌నాథ్ సింగ్‌కి బ్రీఫింగ్ ఇచ్చారు. AK-203 అసాల్ట్ రైఫిల్స్‌ను అమేథీలో భారత్-రష్యా జాయింట్ వెంచర్‌లో తయారు చేయబడింది. లద్దాఖ్ సెక్టార్‌లోని ఎత్తైన ప్రదేశాల్లో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.