2023-24 Budget: బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించనున్న నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నుంచి ప్రీ-బడ్జెట్ సమావేశాలు జరపనున్నారు. 2024లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే ఏడాదికి ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ కు అధిక ప్రాధాన్యం ఉంది. మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బడ్జెట్ ను రూపొందించే దిశగా ఆమె చర్చలు జరపనున్నారు.

2023-24 Budget: బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించనున్న నిర్మలా సీతారామన్

2023-24 Budget: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నుంచి ప్రీ-బడ్జెట్ సమావేశాలు జరపనున్నారు. 2024లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే ఏడాదికి ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ కు అధిక ప్రాధాన్యం ఉంది. మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బడ్జెట్ ను రూపొందించే దిశగా ఆమె చర్చలు జరపనున్నారు.

ఎల్లుండి పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాలు, పర్యావరణ నిపుణులతో ఆమె వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహిస్తారు. 2023-24 బడ్జెట్ రూపకల్పనకు వారి నుంచి సలహాలు తీసుకుంటారు. అలాగే, ఈ నెల 22న వ్యవసాయ సంబంధిత నిపుణులతో ఆమె సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 24న సేవలు, వాణిజ్య, వైద్య, విద్య, నీరు, పారిశుద్ధ్యం, తదితర రంగాల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.

ఈ నెల 28న వాణిజ్య యూనియన్లు, ఆర్థిక నిపుణులతో ఆమె సమావేశం అవుతారు. 2023-24 కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడతారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదల వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరిష్కరించే దిశగా వచ్చే ఏడాది బడ్జెట్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..