Macherla Niyojakavargam: ఓటీటీలో కూడా రాని సినిమా.. నేరుగా బుల్లితెరపై.. కానీ!

యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యవరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించగా, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

Macherla Niyojakavargam: యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యవరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించగా, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫాంలలో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే, ఈ సినిమాను ఇంకా ఏ ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేయకుండానే, నేరుగా టీవీలో టెలికాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో మాచర్ల నియోజకవర్గం సినిమా ఏ టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ.. ఈ సినిమా టెలికాస్ట్ అయ్యేది తెలుగు టీవీ ఛానల్‌లో కాదులెండీ.. మాచర్ల నియోజవకర్గం చిత్రాన్ని హిందీలో డబ్ చేసి సోనీ మాక్స్ టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ చేస్తున్నట్లు సదరు ఛానల్ నిర్వాహకులు తెలిపారు.

ఈ సినిమాకు హిందీలో మాచర్ల చునావ్ క్షేత్ర(MCK) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, ఈ చిత్రాన్ని సోనీ మాక్స్ ఛానల్‌లో డిసెంబర్ 11న రాత్రి 8 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదేమైనా ఓ తెలుగు సినిమా థియేటర్ల నుండి ఓటీటీలో రిలీజ్ కాకముందే, హిందీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా వస్తుండటం విశేషమని చెప్పాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

ట్రెండింగ్ వార్తలు