Nithin : అంధుడిగా నితిన్.. ‘మాస్ట్రో’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది..

యూత్ స్టార్ నితిన్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ‘చెక్’, ‘రంగ్ దే’ తో సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్ పుట్టినరోజు (మార్చి 30)సందర్భంగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న మూవీకి ‘మాస్ట్రో’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.

Nithin : అంధుడిగా నితిన్.. ‘మాస్ట్రో’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది..

Nithin

Nithin: యూత్ స్టార్ నితిన్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ‘చెక్’, ‘రంగ్ దే’ తో సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్ పుట్టినరోజు (మార్చి 30) సందర్భంగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న మూవీకి ‘మాస్ట్రో’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.

Maestro Nithin

మంగళవారం సాయంత్రం ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంధుడిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్లో నితిన్ ప్రేక్షకాభిమానులను ఆకట్టుకోనున్నాడని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. తమన్నా, నభా నటేష్ ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు.

Maestro : యూత్ స్టార్ నితిన్ అంధాధూన్ రీమేక్ ‘మాస్ట్రో’..

బాలీవుడ్ ‘అంధాధూన్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం, జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ, ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జూన్ 11న ‘మాస్ట్రో’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.