అంధుడిగా నితిన్.. రిలీజ్ డేట్ ఫిక్స్..

అంధుడిగా నితిన్.. రిలీజ్ డేట్ ఫిక్స్..

Andhadhun: యంగ్ హీరో నితిన్ మాంచి జోష్ మీదున్నాడు. మూడు ఫ్లాపుల తర్వాత ‘భీష్మ’తో హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, చంద్రశేఖర్ యేలేటితో చేసిన ‘చెక్’ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

Nithin 30

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో అవార్డులు, రివార్డులు అందుకున్న ‘అంధాధూన్’ మూవీని రీమేక్ చేస్తున్నారు. నితిన్ నటిస్తున్న 30వ సినిమా ఇది.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. టబు క్యారెక్టర్‌లో మిల్కీబ్యూటీ తమన్నా, రాధికా ఆప్టే స్థానంలో నభా నటేష్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Nithin 30