Maestro : యూత్ స్టార్ నితిన్ అంధాధూన్ రీమేక్ ‘మాస్ట్రో’..

యూత్ స్టార్ నితిన్ మాంచి జోష్ మీదున్నాడు. మూడు ఫ్లాపుల తర్వాత ‘భీష్మ’తో హిట్ అందుకున్నాడు. చంద్రశేఖర్ యేలేటితో చేసిన ‘చెక్’ తీవ్రంగా నిరాశపరిచినా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన ‘రంగ్ దే’తో హిట్ అందుకుకున్నాడు. మంగళవారం (మార్చి 30) నితిన్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు.

Maestro : యూత్ స్టార్ నితిన్ అంధాధూన్ రీమేక్ ‘మాస్ట్రో’..

Maestro Nithin

Maestro: యూత్ స్టార్ నితిన్ మాంచి జోష్ మీదున్నాడు. మూడు ఫ్లాపుల తర్వాత ‘భీష్మ’తో హిట్ అందుకున్నాడు. చంద్రశేఖర్ యేలేటితో చేసిన ‘చెక్’ తీవ్రంగా నిరాశపరిచినా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన ‘రంగ్ దే’తో హిట్ అందుకుకున్నాడు. మంగళవారం (మార్చి 30) నితిన్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు.

Maestro

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో.. ఆయుష్మాన్ ఖురానా, టబు నటించగా హిందీలో అవార్డులు, రివార్డులు అందుకున్న ‘అంధాధూన్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ నటిస్తున్న 30వ సినిమా ఇది.

టబు క్యారెక్టర్‌లో మిల్కీబ్యూటీ తమన్నా, రాధికా ఆప్టే స్థానంలో నభా నటేష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మాస్ట్రో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నితిన్ లుక్ ఆకట్టుకుంటోంది. జూన్ 11న ‘మాస్ట్రో’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. సంగీతం : మహతి స్వరసాగర్, కెమెరా : జె.యువరాజ్, ఎడిటింగ్ : ఎస్ఆర్ శేఖర్.

Maestro

Maestro