ఫిబ్రవరి 19న ‘చెక్’

ఫిబ్రవరి 19న ‘చెక్’

Check Movie: నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘చెక్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19న సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నామని నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ: ‘‘జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ మధ్యకాలంలో ఈ నేపథ్యంలో సినిమా రాలేదు. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.

నితిన్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌కి చక్కటి స్పందన లభించింది. ఇందులో కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి’’ అని తెలిపారు.

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్ష వర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్ , ఆర్ట్ : వివేక్ అన్నామలై , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి.ఆనంద ప్రసాద్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.