Nitin Gadkari falls SICK on stage : అస్వస్థతతో స్టేజ్‌పైనే కుప్పకూలిన మంత్రి నితిన్ గడ్కరికి .. సీఎం మమతా బెనర్జీ ఆందోళన
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పశ్చిబెంగాల్ పర్యటనలో ఉన్న గడ్కరీ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతుండగానే తీవ్ర అస్వస్థతకు గురై వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. గడ్కరి అస్వస్థతకు గురి అయిన విషయం తెలుసుకున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.

Nitin Gadkari falls SICK on stage : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పశ్చిబెంగాల్ పర్యటనలో ఉన్న గడ్కరీ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతుండగానే తీవ్ర అస్వస్థతకు గురై వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. గడ్కరి అస్వస్థతకు గురి అయిన విషయం తెలుసుకున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు గడ్కరీ గురువారం (నవంబర్ 17,2022) పశ్చిమ బెంగాల్ లోని సిలిగుడిలో పర్యటిస్తున్న సందర్భంగా సిలిగుడిలోని శివమందిర్ నుంచి సేవక్ కంటోన్మెంట్ వరకు పొడవైన రహదారికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతుండగా.. స్టేజీపైనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో గడ్కరీని అక్కడే ఉన్న బీజేపీ నేతలు వెంటనే విశ్రాంతి కోసం గ్రీన్ రూంకు తీసుకెళ్లారు. కానీ తేరుకోలేకపోయారు. దీంతో వెంటనే గ్రీన్ రూమ్ కు డాక్టర్ ను రప్పించారు. గ్రీన్ రూంలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత భాజపా ఎంపీ రాజు బిస్తా నితిన్.. గడ్కరీని తన కారులో ఇంటికి తీసుకెళ్లారు. ఆయన వెంట డాక్టర్లను కూడా తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఎంపీ నివాసంలోనే గడ్కరీకి చికిత్స అందించారు. చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గడంతో కేంద్రమంత్రి అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కాగా గడ్కరీ అనారోగ్యం గురించి తెలుసుకుని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన చెందారు. పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. గడ్కరి ఆరోగ్యం బాగానే ఉందని తెలిసి ఊపిరి తీసుకున్నారు. కాగా సిలిగురిలో కార్యక్రమం ముగిసిన తరువాత మంత్రి దల్ఖోలాకు వెళ్లాల్సి ఉంది. ఆయన పరిస్థితి పూర్తిగా మెరుగు పడేవారకు బహుశా ఈ కార్యక్రమాలను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది.