Bihar Political Crisis: బీహార్‌లో బీజేపీకి షాక్.. ఎన్డీయేకు నితీష్ గుడ్ బై? కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అడుగులు..

దేశవ్యాప్తంగా నయా స్కెచ్‌లతో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్‌లు ఇస్తున్న బీజేపీకి.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఊహించని షాకిచ్చాడు.

Bihar Political Crisis: బీహార్‌లో బీజేపీకి షాక్.. ఎన్డీయేకు నితీష్ గుడ్ బై? కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అడుగులు..

Bihar Cm Nitheesh kumar

Bihar Political Crisis: దేశవ్యాప్తంగా నయా స్కెచ్‌లతో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్‌లు ఇస్తున్న బీజేపీకి.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఊహించని షాకిచ్చాడు. గత కొద్దిరోజులుగా బీహార్ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ గందరగోళానికి తెరదించుతూ నితీష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా నితీష్‌తో ఫోన్‌లో చర్చలు జరిపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ రోజు సాయంత్రం 4గంటలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ జేడీ(యూ) ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ఫాగు చౌహాన్ ను కలవనున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్ తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Bihar Assembly Speaker: స్పీకర్‭కు కొవిడ్ పాజిటివ్.. విచిత్రంగా ఒక్క రోజులోనే రికవరీ

బీహార్ రాష్ట్రంలో బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాష్ట్రం అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీ నిరూపించుకోవాలంటే 122 సీట్లు కావాలి. ప్రస్తుత లెక్కల ప్రకారం బీహార్‌లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీ. ఆ పార్టీకి అసెంబ్లీలో 79 మంది సభ్యులున్నారు. బీజేపీకి 77, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19, కమ్యూనిస్టు పార్టీకి 12, ఏఐఎంఐఎంకు 01, హిందుస్థానీ ఆవామ్ మోర్చాకు 04 మంది సభ్యులు ఉన్నారు. వీరుకాక మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ, జేడీ(యూ) పార్టీలు కలిసి నితీష్ కుమార్ సీఎంగా బీహార్ లో పాలన జరుగుతుంది.

Bihar: బిహార్‌లో కొత్త చట్టం… ప్రభుత్వ ఉద్యోగుల రెండో పెళ్లికి పర్మిషన్ తప్పనిసరి

గత కొద్ది కాలంగా జేడీ(యూ), బీజేపీల మధ్య విబేధాలు తలెత్తాయి. గత రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంకు సైతం నితీష్ కుమార్ హాజరు కాలేదు. ఎన్డీయే నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధమైన నితీష్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బీహార్ లో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో ఫోన్ లో ఫలు దఫాలుగా చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో నేరుగా నితీష్ సమావేశమయ్యారు. బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకుంటున్న క్రమంలో ప్రభుత్వం కూలిపోకుండా మద్దతు ఇవ్వాలని నితీష్ ఆ ఇరు పార్టీలను కోరినట్లు తెలుస్తొంది.

Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ..? ఆ పార్టీ ముఖ్య‌నేతలతో సంప్రదింపులు

నితీష్ ప్రతిపాదనకు కాంగ్రెస్, ఆర్జేడీలు ఓకే చెప్పడంతో బీజేపీ నుంచి విడిపోయేందుకు నితీష్ సిద్ధమయ్యారు. ఈ ఉదయం 11గంటలకు జేడీయూ నేతలతో నితీష్ కుమార్ సమావేశమయ్యారు. అంతేకాక ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల మహాగట్ బంధన్ కూటమి ఎమ్మెల్యేలు కూడా రబ్రీదేవి నివాసంలో భేటీ అయ్యారు. నితీష్ కుమార్ సీఎంగా ఉండేలా.. మద్దతునిస్తూ వారంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సాయంత్రం 4గంటల సమయంలో నితీష్ కుమార్ గవర్నర్ ను కలిసి భాజపాతో పొత్తు వీడుతున్నామని గవర్నర్ కు అధికారికంగా చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తొంది. అదే జరిగితే నితీష్ ప్రభుత్వం మైనార్టీలో పడుతుంది. దీంతో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు ఇతర పార్టీలు నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించేలా చర్చలు పూర్తయినట్లు సమాచారం.