Nitish Kumar swearing in CM : బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రేపే ప్రమాణ స్వీకారం..8వ సారి ముఖ్యమంత్రిగా

బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం(ఆగస్టు10,2022) సాయంత్రం 4 గంటలకు నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నితీశ్ కుమార్ 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీశ్ తోపాటు కూటమిలోని కొందరు నేతలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Nitish Kumar swearing in CM : బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రేపే ప్రమాణ స్వీకారం..8వ సారి ముఖ్యమంత్రిగా

Nitish Kumar swearing in CM

Nitish Kumar swearing in CM : బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం(ఆగస్టు10,2022) సాయంత్రం 4 గంటలకు నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నితీశ్ కుమార్ 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీశ్ తోపాటు కూటమిలోని కొందరు నేతలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహాకూటమి నేతగా నితీశ్ కుమార్ ఉన్నారు. నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని వినతి పత్రం అందజేశారు. నితీశ్ కు మద్దతుగా తేజస్వి యాదవ్ గవర్నర్ కు లేఖ ఇచ్చారు.

ఇవాళ బీహార్ సీఎం పదవికి నితీశ్‌కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యుల మద్దతు లేఖను గవర్నర్ కు ఇచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా నితీశ్ కుమార్ అడుగులు వేస్తున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో నితీశ్ మరోసారి సీఎం పదవి చేపట్టనున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి నితీశ్ మళ్లీ ప్రభుత్నాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బీజేపీ తమపై కుట్ర చేసిందని ఎమ్మెల్యేల వద్ద నితీశ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Bihar CM Nitish Kumar Resigned : బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా..ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు!

కొత్త ప్రభుత్వంలో తేజస్వీయాదవ్‌ను కేబినెట్‌లోకి తీసుకునే యోచనలో నితీశ్ ఉన్నారు. అయితే తనకు హోంశాఖ కావాలని తేజస్వీ యాదవ్ పట్టుపడుతున్నారు. తేజస్వీయాదవ్ ఇచ్చిన ఇప్తార్‌ విందుకు గతంలో నితీశ్ హాజరయ్యారు. అప్పటి నుంచే బీజేపీకి వ్యతిరేకంగా ఆర్జేడీ, జేడీయు మధ్య మంతనాలు జరిగినట్లు ప్రచారం ఉంది. అటు జేడీయు నేతలు.. నితీశ్‌నుద్దేశించి కీలక ట్వీట్లు చేస్తున్నారు. దేశం మీకోసం ఎందురు చూస్తోందని జేడీయు ఎమ్మెల్సీ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిని బట్టి చూస్తే.. ఢిల్లీలో పాగా వేసేందుకు బీహార్‌ నుంచి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీహార్ లో బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీ నిరూపించుకోవాలంటే 122 సీట్లు కావాలి. ప్రస్తుత లెక్కల ప్రకారం బీహార్‌లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీ. ఆ పార్టీకి అసెంబ్లీలో 79 మంది సభ్యులున్నారు. బీజేపీకి 77, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19, కమ్యూనిస్టు పార్టీకి 12, ఏఐఎంఐఎంకు 01, హిందుస్థానీ ఆవామ్ మోర్చాకు 04 మంది సభ్యులు ఉన్నారు. వీరుకాక మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నిన్నటి వరకు బీజేపీ, జేడీ(యూ) పార్టీలు కలిసి నితీష్ కుమార్ సీఎంగా బీహార్ లో పాలన కొనసాగింది. ప్రస్తుతం నితీశ్ కు ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు.

Bihar Nitish Kumar CM Post : ఏ పార్టీకి మెజారిటీ వచ్చినా సీఎం కుర్చీ నితీశ్ కే..17 ఏళ్లుగా బీహార్‌ను ఏలుతున్న అపర చాణుక్యుడు

కొంతకాలంగా జేడీ(యూ), బీజేపీల మధ్య విబేధాలు తలెత్తాయి. గత 2 రోజుల క్రితం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సైతం నితీష్ కుమార్ హాజరు కాలేదు. ఎన్డీయే నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధమైన నితీష్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బీహార్ లో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో ఫోన్ లో ఫలు దఫాలుగా చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో నేరుగా నితీష్ సమావేశమయ్యారు. బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకుంటున్న క్రమంలో ప్రభుత్వం కూలిపోకుండా మద్దతు ఇవ్వాలని నితీష్ ఆ ఇరు పార్టీలను కోరినట్లు తెలుస్తొంది.