Nivetha Pethuraj : నేను అలాంటి దాన్ని కాను, మనసులో మాట బయటపెట్టిన నివేదా పేతురాజ్

మెంట‌ల్‌ మ‌దిలో చిత్రంతో టాలీవుడ్ కు ద‌గ్గ‌రైంది త‌మిళ సోయ‌గం నివేదా పేతురాజ్. ఆ త‌ర్వాత పలు త‌మిళ‌, తెలుగు చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తాజాగా విశ్వ‌క్ సేన్ తో క‌లిసి పాగ‌ల్ సినిమాలో న‌టించింది.

Nivetha Pethuraj : నేను అలాంటి దాన్ని కాను, మనసులో మాట బయటపెట్టిన నివేదా పేతురాజ్

Nivetha Pethuraj

Nivetha Pethuraj : మెంట‌ల్‌ మ‌దిలో చిత్రంతో టాలీవుడ్ కు ద‌గ్గ‌రైంది త‌మిళ సోయ‌గం నివేదా పేతురాజ్. ఆ త‌ర్వాత పలు త‌మిళ‌, తెలుగు చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తాజాగా విశ్వ‌క్ సేన్ తో క‌లిసి పాగ‌ల్ సినిమాలో న‌టించింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మేక‌ర్స్ నుంచి త‌న ద‌గ్గ‌ర‌కు ఎక్కువ‌గా సీరియ‌స్ రోల్స్ ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని, ఇది కొంచెం క‌ష్టంగా అనిపిస్తుంద‌ని చెప్పింది. పాగ‌ల్ సినిమాలో కూడా త‌న‌ది కాస్త సీరియ‌స్ ట‌చ్‌తో ఉన్న పాత్ర కావ‌డంతో పూర్తి స్థాయిలో సంతోషంగా లేన‌ని అంటోంది. ఇక నుంచి త‌న‌లోని గ్లామ‌ర‌స్ యాంగిల్ ను ఎలివేట్ చేసే పాత్ర‌ల‌కే ఎక్కువ మొగ్గు చూపిస్తానంటోంది. ప్రస్తుతం పాగల్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆమె తాజాగా ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాలపై ఓపెన్ అయింది.

” గతంలో కూడా ”మెంటల్‌ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల.. వైకుంఠపురములో” లాంటి సినిమాల్లో దాదాపు సీరియస్‌ క్యారెక్టర్సే చేశాను. ‘పాగల్‌’లోనూ అలాంటి క్యారెక్టరే చేశాను. అదేంటో నా లుక్స్, ప్రవర్తన చూసి నాకు సీరియస్‌ క్యారెక్టర్స్‌ అయితే బాగా సూట్‌ అవుతాయని భావిస్తున్నారేమో. అందుకే అన్నీ అలాంటి పాత్రలే ఇస్తున్నారు. చూడటానికి సీరియస్‌ అమ్మాయిలా కనపడినా నిజంగా నేనలాంటిదాన్ని కాదు” అని నివేదా చెప్పింది.

ప్ర‌తీ సారి సీరియ‌స్ పాత్ర‌లు చేసి చేసి అల‌సిపోయాను. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే డైరెక్ట‌ర్లు ఇక నుంచి క్రేజీ, గ్లామ‌రస్ పాత్ర‌ల‌తో వ‌స్తార‌ని ఆశిస్తున్నాన‌ని త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పుకొచ్చింది. మ‌రి నివేదా పేతురాజ్ కోరుకున్న‌ట్టుగా ఫిల్మ్ మేక‌ర్స్ అలాంటి పాత్ర‌ల్లో అవ‌కాశ‌మిస్తారా..? లేదా అనేది చూడాలి.

ప్ర‌స్తుతం వేణు ఉడుగుల డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న విరాట‌ప‌ర్వం సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది నివేదా పేతురాజ్‌. దీంతోపాటు చందూమొండేటి డైరెక్ష‌న్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా..త‌మిళంలో రెండు సినిమాల‌ను లైన్ లో పెట్టింది. ఆగస్టు 14న ‘పాగల్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.