Anushka: స్వీటీ.. ఇప్పట్లో వచ్చేలా లేదుగా!

టాలీవుడ్ జేజమ్మగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను చూసిన అందాల భామ అనుష్క శెట్టి, ఇటీవల కాలంలో సరైన సినిమా ఎంపిక చేయడం లేదని ఆమె అభిమానులు....

Anushka: స్వీటీ.. ఇప్పట్లో వచ్చేలా లేదుగా!

No Big Movies From Anushka

Anushka: టాలీవుడ్ జేజమ్మగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను చూసిన అందాల భామ అనుష్క శెట్టి, ఇటీవల కాలంలో సరైన సినిమా ఎంపిక చేయడం లేదని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఆమె నటించిన ‘నిశబ్దం’ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆ తరువాత ఆమె నుండి ఇప్పటివరకు మరే ఇతర సినిమా రాలేదు. పోనీ ఆమెకు ఆఫర్లు రావడం లేదా అంటే, బడా దర్శకనిర్మాతలు ఆమె డేట్ల కోసం క్యూ కట్టేవారు.

Anushka Shetty: మూడేళ్ల తరువాత అనుష్క బ్యాక్ టు వర్క్!

కానీ అదంతా గతం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అనుష్క ఫుల్ ఫాంలో ఉన్నప్పుడు ఆమె వద్దకు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులే ఎక్కువగా వచ్చాయట. అయితే తరుచూ అలాంటి సినిమాలు చేయడం మంచిది కాదని, అలాగే హీరోయిన్ పాత్రలు కూడా చేయడం నచ్చక అనుష్క సినిమాలు సైన్ చేయలేదు. దీంతో రెండేళ్ల పాటుగా అనుష్క ఖాళీగా ఉంటూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆమెను బడా సినిమాల్లో తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

Anushka Shetty: అనుష్క చెంతకు నాగరత్నమ్మ..?

దీంతో వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని ఆమె భావిస్తోందట. అందుకే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యింది స్వీటీ. అంటే ఇప్పట్లో అనుష్క నుండి భారీ సినిమాను ఎక్స్‌పెక్ట్ చేసేవారికి నిరాశే మిగులుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆమె మళ్లీ తన సత్తా చాటి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకుంటేనే, ఆమెకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.